జూనియర్ ఎన్టీఆర్ ఫామ్ ల్యాండ్ కొనడానికి అసలు కారణం ఇదే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాకు 25 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోగా ఆర్ఆర్ఆర్ కోసం 35 కోట్ల రూపాయలు తీసుకున్నారని తెలుస్తోంది.ఇప్పటికే పలువురు టాలీవుడ్ హీరోలు తమ సంపాదనను రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు.

 Young Tiger Junior Ntr Hyderabad New Farm House Details Here, Details Here, Farm-TeluguStop.com

మరి కొంతమంది ఇతర వ్యాపారాలలో ఇన్వెస్ట్ చేస్తూ తమ క్రేజ్ ను బిజినెస్ కు వినియోగించుకుంటూ సత్తా చాటుతున్నారు.

కొందరు నటులు ఫామ్ హౌజ్ లపై దృష్టి పెట్టగా అలా దృష్టి పెట్టిన నటుల జాబితాలో ఎన్టీఆర్ చేరారు.

హైదరాబాద్ నగర శివార్లలో కొనుగోలు చేసిన భూమిలో ఎన్టీఆర్ 6 ఎకరాల ల్యాండ్ ను కొనుగోలు చేయగా ఇందులో ఫామ్ హౌజ్ ను అభివృద్ధి చేయనున్నారని ఎన్టీఆర్ భార్య ఈ వ్యవహారాలను చూసుకుంటారని సమాచారం.లక్ష్మీ ప్రణతి తనకు నచ్చిన విధంగా ఈ ఫామ్ హౌజ్ ను డెవలప్ చేయనున్నారని తెలుస్తోంది.

Telugu Farm, Ntr, Komuram Bheem, Ntr Farm, Organic, Young Tiger Ntr-Movie

ఫామ్ హౌజ్ ను డెవలప్ చేయడం సులువు కాకపోయినా ఈ ఫామ్ ల్యాండ్ లో తారక్ ఆర్గానిక్ ఫార్మింగ్ జరిగేలా చేయనున్నారని సమాచారం.ఎన్టీఆర్ ఎంతో ముచ్చట పడి ఈ స్థలాన్ని కొనుగోలు చేశారని తెలుస్తోంది.ఈ ఫామ్ ల్యాండ్ లో ఒకవైపు ఇల్లు కట్టి మరోవైపు పూల మొక్కలను, తోటలను ఎన్టీఆర్ అభివృద్ధి చేయనున్నారని సమాచారం.తారక్ కూడా వీలు కుదిరితే ఆర్గానిక్ ఫార్మింగ్ పనులలో పాల్గొంటారు.

Telugu Farm, Ntr, Komuram Bheem, Ntr Farm, Organic, Young Tiger Ntr-Movie

ఫామ్ ల్యాండ్ కోసం ఎన్టీఆర్ భారీ మొత్తమే ఖర్చు చేశారని వినిపిస్తుండగా ఎంత మొత్తం అనే విషయం తెలియాల్సి ఉంది.ఎన్టీఆర్ కొనుగోలు చేసిన ఫామ్ హౌజ్ కు దగ్గర్లోనే పవన్ కళ్యాణ్ ఫామ్ హౌజ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.మరోవైపు ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ త్వరలో రిలీజ్ కానుండగా ఈ సినిమాలో ఇద్దరు హీరోలకు సమాన ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube