జూనియర్ ఎన్టీఆర్ కారు నంబర్ల వెనుక సీక్రెట్ ఏంటో మీకు తెలుసా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఉన్న కార్లకు నంబర్ 9999 ఉంటుందనే విషయం తెలిసిందే.టాలీవుడ్ ఇండస్ట్రీలో కార్లను అమితంగా ఇష్టపడే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు.

 Young Tiger Junior Ntr Car Numbers Secrets Details, 9999, Car Numbers, Interesti-TeluguStop.com

కొన్నిరోజుల క్రితం ఎన్టీఆర్ దాదాపుగా 4 కోట్ల రూపాయలు ఖర్చు చేసి లంబోర్ఘిని ఉరుస్ మోడల్ ను సైతం కొనుగోలు చేశారు.గతంలో చిరంజీవి, శ్రీకాంత్ ఎక్కువగా కార్లను మార్చేసేవారు.

అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ఎక్కువగా కార్లను మారుస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

మరోవైపు ఎన్టీఆర్ కార్లకు సైతం ఒకే నంబర్ ఉండటానికి ప్రత్యేకమైన కారణం ఉంది.

బలమైన సెంటిమెంట్ వల్లే ఎన్టీఆర్ అన్ని కార్లకు ఒకే నంబర్ ఉండేలా చూసుకుంటున్నారు.మన స్టార్ హీరోలు ఏదైనా సెంటిమెంట్ పరంగా కలిసి వస్తే ఆ సెంటిమెంట్ ను వదులుకోవడానికి అస్సలు ఇష్టపడరు.

సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్ లో కూడా స్టార్ హీరోలు సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారనే సంగతి తెలిసిందే.

ఒక సందర్భంలో ఎన్టీఆర్ సైతం 9999 నంబర్ కారుకు ఎక్కువగా ఉండటానికి గల కారణాలను వెల్లడించారు.

Telugu Car Numbers, Harikrishna, Ntr, Lamborghiniurus, Ntrcar, Ntr Car Number, S

తనకు 9 నంబర్ అంటే ఇష్టం కావడంతో పాటు తాత సీనియర్ ఎన్టీఆర్ కార్లకు కూడా 9999 నంబర్ ఉండటంతో నాన్న హరికృష్ణ కూడా అవే నంబర్ ఉన్న కార్లను వాడటంతో తాను కూడా 9999 నంబర్ కార్లను వినియోగిస్తున్నానని ఎన్టీఆర్ తెలిపారు.కారు నంబర్ల విషయంలో వేరే ఆలోచన లేకుండా 9999 నంబర్ ను ఫాలో అవుతున్నానని ఎన్టీఆర్ కామెంట్లు చేశారు.

Telugu Car Numbers, Harikrishna, Ntr, Lamborghiniurus, Ntrcar, Ntr Car Number, S

ఈ 9999 నంబర్ ను వేలం పాట ద్వారా కొనుగోలు చేయడానికి ఎన్టీఆర్ లక్షల్లో ఖర్చు చేస్తుండటం గమనార్హం.ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్ లో కూడా 9999 అనే నంబర్ ను వినియోగిస్తున్నారు.తారక్ డైరెక్ట్ గా సెంటిమెంట్ అని చెప్పకపోయినా కారు నంబర్ల విషయంలో సెంటిమెంట్ ను ఫాలో అవుతుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube