జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి క్లాసికల్ డ్యాన్స్ వీడియో.. మీరు చూశారా?

సినీ పరిశ్రమలలో నటులలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ తోనే సినీ పరిశ్రమకు పరిచయం అవుతుంటారు.కొందరు నటులు మోడలింగ్ రంగంలో బాగా గుర్తింపు పొంది అడుగుపెట్టగా.

 Young Tiger Jr Ntr Old Classical Dance Video Goes Viral In Social Media-TeluguStop.com

మరికొంతమంది ఇతర కలలతో పరిచయం అవుతుంటారు.ఇలా టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమలో కూడా కొందరు నటులు ఉన్నారు.

ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తన కళకు సంబంధించిన డాన్స్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

 Young Tiger Jr Ntr Old Classical Dance Video Goes Viral In Social Media-జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి క్లాసికల్ డ్యాన్స్ వీడియో.. మీరు చూశారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి అందరికి తెలిసిందే.

ఆయన నటన తో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇప్పటికి కూడా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్.

ఇక ఎన్టీఆర్ నటనలోనే కాకుండా డాన్స్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆయన సినిమాల్లో ఎక్కువగా ఆయన నటన తో పాటు ఆయన డాన్స్ కూడా బాగా‌ ఆకట్టుకుంటుంది.

Telugu Classical Dance, Hrithik Roshan, Jr Ntr, Tollywood-Movie

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కు భరతనాట్యంలో కూడా మంచి అనుభవం ఉంది.ఆయన చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్స్ లో మంచి శిక్షణ తీసుకున్నాడు.అంతేకాకుండా బెస్ట్ డాన్సర్ గా పేరొందాడు.బహుశా క్లాసికల్ డాన్స్ లో మంచి శిక్షణ పొందడం వల్ల ఇప్పుడు డాన్సులతో అలరిస్తున్నాడు.అంతేకాకుండా ఎన్టీఆర్ డాన్స్ గురించి బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కూడా ప్రస్తావించాడు.

ఎన్టీఆర్ కు డాన్స్ పట్ల ఉన్న ఆసక్తిని గమనించిన తన తల్లి షాలిని ఆయనకు ట్రైనింగ్ ఇప్పించింది.

అలా భరత నాట్యంలో శిక్షణ పొంది ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చాడు.ఎన్నో బహుమతులు కూడా అందుకున్నాడు.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ చిన్నప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

#Hrithik Roshan #Classical Dance #Jr NTR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు