జూనియర్ ఎన్టీఆర్ కు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా..?

దాదాపు రెండు దశాబ్దాల క్రితం నిన్ను చూడాలని సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్.టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత సినిమాలతో వరుసగా ఐదు విజయాలు సొంతం చేసుకున్న ఎన్టీఆర్ చరణ్ తో కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంటానని భావిస్తున్నారు.

 Nandamuri Hero Junior Ntr Hobbies And Favorite Food, Junior Ntr,ntr Favorite Foo-TeluguStop.com

Telugu Jr Ntr, Ntr, Nandamurintr, Ntrfavorite, Ntr Favorite, Prans Biryani, Praw

సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో బొద్దుగా ఉన్న ఎన్టీఆర్ యమదొంగ సినిమా సమయంలో లైపో చేయించుకుని ఏకంగా 30 కిలోల బరువు తగ్గారు.బిగ్ బాస్ సీజన్ 1ను హోస్ట్ చేసిన సమయంలో బిగ్ బాస్ హౌస్ లో వంట చేసిన ఎన్టీఆర్ ఇంట్లో కూడా అప్పుడప్పుడూ వంట చేస్తూ ఉంటారు.మిగతా వంటకాలతో పోల్చి చూస్తే ఎన్టీఆర్ మటన్ బిర్యానీని అద్భుతంగా వండుతారని తెలుస్తోంది.అమ్మచేతి వంటను ఇష్టపడే ఎన్టీఆర్ కు రొయ్యల బిర్యానీని తినడం చాలా ఇష్టం.

Telugu Jr Ntr, Ntr, Nandamurintr, Ntrfavorite, Ntr Favorite, Prans Biryani, Praw

రొయ్యల బిర్యానీతో పాటు నాటుకోడి కూర, వేపుడులను ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా తింటారు.ఒత్తిడిని తగ్గించుకోవాలనుకున్నా లేదా షూటింగ్ లు లేని సమయంలో ఎన్టీఆర్ ఇంట్లో వంట చేస్తారని తెలుస్తోంది.ఎన్టీఆర్ కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్, క్రికెట్ ఎంతో ఇష్టం.

Telugu Jr Ntr, Ntr, Nandamurintr, Ntrfavorite, Ntr Favorite, Prans Biryani, Praw

తాత సీనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ కు ఇష్టమైన సినిమా దానవీర శూరకర్ణ కాగా తన సినిమాల్లో నాన్నకు ప్రేమతో సినిమా అంటే ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టం.ఎన్టీఆర్ కు ఇష్టమైన హీరో సీనియర్ ఎన్టీఆర్ కాగా ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి కావడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube