డఫా ‌గేమ్ కు అలవాటు పడి 15 లక్షలు అప్పు చేసి ఆడాడు.. చివరికి…  

Crime news, Dafabet online game, young student commits suicide, Mancherial - Telugu Crime News, Dafabet Online Game, Mancherial, Young Student Commits Suicide

ప్రస్తుత కాలంలో కొందరు ప్రతి విషయానికి ఆత్మహత్య చేసుకుంటూ తమ కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నారు.తాజాగా డఫా గేమ్ ఆడడం కోసం దాదాపుగా 15 లక్షల రూపాయలు అప్పు చేశాడని తల్లిదండ్రులు మందలించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంచిర్యాల జిల్లా వెలుగు చూసింది.

 Young Student 15lakhs For Game

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకు చెందిన మొదెల గ్రామంలో మధుకర్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.యువకుడు ప్రస్తుతం లాక్ డౌన్ కావడంతో ఇంటి పట్టునే ఉంటున్నాడు.

ఈ క్రమంలో  మధుకర్ కాలక్షేపం కోసం అప్పుడప్పుడు ఆన్ లైన్ గేమ్స్ ఆడటం మొదలు పెట్టాడు.రానురాను ఈ కాలక్షేపం కాస్త బానిసత్వానికి దారి తీసింది.

డఫా ‌గేమ్ కు అలవాటు పడి 15 లక్షలు అప్పు చేసి ఆడాడు.. చివరికి…-Latest News-Telugu Tollywood Photo Image

దీంతో ఏకంగా మధుకర్ ఆన్ లైన్ డఫా గేమ్ ఆడడానికి దాదాపుగా 15 లక్షల రూపాయలు బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో అప్పు చేశాడు.ఈ విషయం తెలుసుకున్న  మధుకర్ తల్లిదండ్రులు పరువు, గౌరవం కోసం అప్పులన్నీ తీర్చారు.

అలాగే  ఇక నుంచైనా ఆన్ లైన్ గేమ్స్ ఆడటం మానేసి బుద్ధిగా చదువుకోవాలని  మధుకర్ ని మందలించారు.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురైనటువంటి మధుకర్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.ఇందులో భాగంగా పురుగుల మందు సేవించాడు.ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినా ఉపయోగం లేకపోయింది.

దీంతో చేతికి అంది వచ్చిన కొడుకు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

#Mancherial

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Young Student 15lakhs For Game Related Telugu News,Photos/Pics,Images..