యంగ్ హీరో పెళ్ళికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్...  

young rebel star prabhas send wishes and costly gift to sumanth ashwin marriage, sumanth ashwin, sumanth ashwin marriage news, young rebel star prabhas, TOllywood, Varsham Movie, Ms Raju, FIlm Producer, - Telugu Film Producer, Ms Raju, Sumanth Ashwin, Sumanth Ashwin Marriage News, Tollywood, Varsham Movie, Young Rebel Star Prabhas, Young Rebel Star Prabhas Send Wishes And Costly Gift To Sumanth Ashwin Marriage

తెలుగులో తూనీగ తూనీ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ప్రముఖ సినీ నిర్మాత మరియు దర్శకుడు ఎమ్మెస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవలే సుమంత్ అశ్విన్ దీపిక అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు.

TeluguStop.com - Young Rebel Star Prabhas Send Wishes And Costly Gift To Sumanth Ashwin Marriage

నెల 13వ తారీఖున ఎమ్మెస్ రాజు కి సంబంధించిన అతికొద్ది మంది సమక్షంలో చాలా గ్రాండ్ గా  ఈ వివాహ వేడుక జరిగింది.అయితే దర్శకుడు మరియు నిర్మాత ఎమ్మెస్ రాజు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, సినిమా పరిశ్రమలకు చెందిన సెలబ్రిటీలకు ఆహ్వానాలను పంపాడు.

కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ పరిస్థితుల కారణంగా సినీ సెలబ్రిటీలు సుమంత్ అశ్విన్ పెళ్లికి రాలేకపోయారు.కానీ సోషల్ మీడియా ద్వారా దీవెనలు  పంపుతూ విష్ చేసారు.

TeluguStop.com - యంగ్ హీరో పెళ్ళికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కాగా టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా సుమంత్ అశ్విన్ పెళ్లికి హాజరు కాలేక పోయాడు.దీంతో తాజాగా ప్రభాస్ తన దీవెనలతో పాటు ఖరీదైన కానుకలను సుమంత్ అశ్విన్ కి పంపించాడు.దీంతో ఈ విషయాన్ని ఎమ్మెస్ రాజు స్వయంగా తెలియజేస్తూ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రభాస్ పంపిన కానుకల తాలూకా ఫోటోలను షేర్ చేస్తూ ధన్యవాదాలు తెలిపాడు.అయితే మెగాస్టార్ చిరంజీవి, భూమిక చావ్లా, మరియు ఇతర కన్నడ, బాలీవుడ్, సినీ సెలబ్రిటీలు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా సుమంత్ అశ్విన్ విషెస్ తెలిపారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సుమంత్ అశ్విన్ తెలుగులో ఇదే మా కథ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్ కి జోడిగా నూతన హీరోయిన్ తాన్యా హాప్ నటిస్తోంది.

  అంతేగాక ఈ చిత్రంలో సీనియర్ నటుడు శ్రీకాంత్ మరియు వెటరన్ హీరోయిన్ భూమిక చావ్లా లు ప్రధాన తారాగణంగా నటించారు.ఇక ప్రభాస్ విషయానికొస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నాడు.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ చిత్ర షూటింగ్ పనులు పూర్తవడంతో యంగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నాడు.ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ తరహాలో ఉండబోతున్నట్లు సమాచారం.

#YoungRebel #Ms Raju #Sumanth Ashwin #YoungRebel #SumanthAshwin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు