వైరల్ ఫోటో: గడ్డం, మీసం లేకుండా స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టండి!  

young rebel star prabhas photo goes viral in social media - Telugu @prabhasraju, Bahubali, Prabhas, Prabhas Viral Photo, Young Rebel Star

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ స్టార్ హీరోలుగా చలామణీ అవుతున్నారు.అయితే వీళ్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందు చేసిన ఫోటోషూట్స్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ వైరల్ అవుతుంటాయి.

TeluguStop.com - Young Rebel Star Prabhas Photo Goes Viral In Social Media

తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు సంబంధించి అరుదైన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

వచ్చే నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు కావడంతో నెల రోజుల ముందు నుంచే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావిడి ప్రారంభించారు.

TeluguStop.com - వైరల్ ఫోటో: గడ్డం, మీసం లేకుండా స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టండి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

బాహుబలి సిరీస్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ కెరీర్ ప్రారంభంలో చేసిన ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.గడ్డం, మీసం లేకుండా గన్ పట్టుకున్న ప్రభాస్ ఈ ఫోటోలో కొత్తగా ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.కెరీర్ ప్రారంభంలో ప్రభాస్ నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు.

వర్షం, ఛత్రపతి లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు సాధించినా ఆ హిట్ మ్యానియాను కంటిన్యూ చేయడంలో ప్రభాస్ విఫలమయ్యాడు.డార్లింగ్ సినిమా నుంచి ప్రభాస్ నటించిన సినిమాలన్నీ హిట్లు కావడం మిర్చి, బాహుబలి సిరీస్ సినిమాలతో ప్రభాస్ కు అంతర్జాతీయంగా గుర్తింపు రావడం జరిగింది.

గతేడాది విడుదలైన సాహో సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చినా ప్రభాస్ క్రేజ్ వల్లే ఆ సినిమా నిర్మాతలు తక్కువ నష్టాలతో బయటపడ్డారు.ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యాం సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా, ఆది పురుష్ సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో, ప్యాన్ ఇండియా అప్పీల్ తో తెరకెక్కుతున్న సినిమాలే కావడం గమనార్హం.

#Bahubali #Prabhas #PrabhasViral #@PrabhasRaju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Young Rebel Star Prabhas Photo Goes Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..