తనకి హిట్ ఇచ్చిన దర్శకుడు చనిపోవడంతో అతడి కొడుకు కోసం ప్రభాస్...

తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  2004వ సంవత్సరంలో హీరోగా నటించిన “వర్షం” చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేయడమేకాకుండా ప్రభాస్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిల్చింది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ కి జంటగా  స్టార్ హీరోయిన్ “త్రిష” నటించగా… విలన్ గా యాక్షన్ హీరో గోపీచంద్ నటించాడు.

 Young Rebel Star Prabhas Is Encouraging Former Director Sobhan Son Santosh Shobh-TeluguStop.com

 ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ స్వర్గీయ దర్శకుడు శోభన్ దర్శకత్వం వహించగా, ప్రముఖ సినీ నిర్మాత ఎమ్మెస్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు.  కాగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు శోభన్ అనుకోకుండా గుండె పోటు రావడంతో 2008 వ సంవత్సరంలో మృతి చెందాడు.
  అయితే దర్శకుడు శోభన్ కి సంతోష్ శోభన్ అనే కొడుకు ఉన్నాడు.కాగా సంతోష్ శోభన్ ఆ మధ్య తెలుగులో ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా వ్యవహరించిన “పేపర్ బాయ్” అనే చిత్రంలో హీరోగా నటించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు.

దీంతో సంతోష్ శోభన్ నటనా ప్రతిభను గుర్తించిన ప్రభాస్ అతనికి సహాయం చేసేందుకు గాను యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాల్లో రికమెండ్ చేశాడు.అంతేగాక గతంలో సంతోష్ శోభన్ బాబు హీరోగా నటించిన “పేపర్ బాయ్” చిత్ర ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నాడు.

ఇదంతా ప్రభాస్ తనకి గతంలో “వర్షం” చిత్రం ద్వారా హిట్ ఇచ్చినటువంటి దర్శకుడు శోభన్ కోసం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సంతోష్ శోభన్ తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రాలలో హీరోగా నటిస్తున్నాడు.అయితే  ప్రభాస్ ప్రస్తుతం దాదాపుగా మూడు భారీ బడ్జెట్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే ప్రముఖ దర్శకుడు కేకే రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న “రాదే శ్యామ్” చిత్ర షూటింగ్ పనులు కూడా పూర్తి చేసుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube