షాప్ కీపర్ అడిగిన ప్రశ్నలకు ఆ నింబు మిర్చి పిల్లోడు ఇచ్చిన సమాధానాలు మనసును కదిలించాయి.!

ఉదయం 10 అవుతోంది.ముంబాయ్ నగర వీధులు చాలా బిజీబిజీగా మారిపోతున్నాయ్.

 Young Nimbu Mirchi Hawker And A Shopkeeper Story-TeluguStop.com

అప్పుడే వచ్చిన షాప్ యజమాని తన షాప్ ను తెరిచి సమాన్లు సర్దుకుంటున్నాడు.అంతలోనే అక్కడికి వచ్చాడు ఓ పిల్లాడు.

చేతిలో నిమ్మకాయలు, మిరపకాయలు పట్టుకొని సార్ దిష్టి యంత్రాలు కావాలా? అంటూ….అతనిని ఎప్పటి నుండో గమనిస్తున్న ఆ షాప్ యజమాని బాబు ఇటురా.

అని ఎప్పటి నుండో తాను అడగాలనుకున్న ప్రశ్నలను అడిగాడు….దానికి ఆ పిల్లాడి చెప్పిన సమాధానాలు మదిని కరిగించాయ్.

అతని ఆలోచనా స్థాయి, వాస్తవపరిస్థితులు కళ్లకు కట్టినట్టు కనబడతాయ్ అతని అమాయక సమాధానాల్లో….షాప్ కీపర్: బాబు నీ వయసెంత?
పిల్లాడు: నాకు తెలియదు సార్.!
షా.కీ: నువ్వెక్కడుంటావ్.?
పి: ఇక్కడి నుండి 10 కి.మీ దూరంలో ఉండే స్లమ్ ఏరియాలో సార్.
షా.కీ: అంతదూరం నుండి ఇక్కడికి ఎందుకు రావడం?
పిల్లాడు: ఇక్కడైతే ఎక్కువ డబ్బులు దొరుకుతాయ్ సార్.
షా.కీ: ఎప్పుడూ ఇక్కడే కనబడతావ్.మరి రెస్ట్ ఎప్పుడు తీసుకుంటావ్?
పిల్లాడు: జ్వరం వచ్చినప్పుడు.

షా.కీ:రోజూ ఎన్నగంటలకు వస్తావ్, ఎప్పటి వరకు ఉంటావ్?
పిల్లాడు:రోజూ 7 గంటలకు వస్తాను, తెచ్చిన సామాన్ అంతా అమ్ముడుపోయే వరకుంటాను, అప్పుడప్పుడు రాత్రి 9 అవుతుంది.
షా.

కీ: మీ ఇంట్లో ఎవరెవరుంటారు.?
పిల్లాడు: అమ్మా, నాన్న, చెల్లి ,నేను.
షా.కీ: నాన్న ఏంచేస్తారు?
పిల్లాడు: ఆయన ఏం చేయరు.ఆయన మంచం మీదున్నారు.ఆయన 3యేళ్ల నుండి ఓ వ్యాధితో బాధపడుతున్నారు.
షా.కీ:నువ్వు స్కూల్ కు వెళతావా?
పిల్లాడు:లేదు , నేను స్కూల్ కు వెళితే మా ఫ్యామిలీని ఎవరు పోషిస్తారు? కానీ నాకు స్కూల్ కు వెళ్లాలని చదువుకోవాలని చాలా ఉంటుంది.కానీ ఏం చేస్తాం.!
షా.

కీ : పెద్దయ్యాక ఏం చేయాలనుకుంటున్నావ్?
పిల్లాడు:మా చెల్లిని మంచిగా చదివించి డాక్టర్ ను చేయాలి.అమ్మను కంటికిరెప్పాల చూచుకోవాలి, మా నాన్నను మంచి హాస్పిటల్ లో చూపించాలి.

అంతే సార్….
షా.

కీ : మరి నీకేం వద్దా?
పిల్లాడు: అమ్మా, నాన్న , చెల్లి.వీళ్లంతా ఉంది నాకోసమే కదా సార్!
షా.

కీ: (కర్చీఫ్ తో కళ్లు తుడుచుకుంటున్నాడు.)
పిల్లాడు: ‘(మిర్చీ-నింబూ.దస్ కా ఏక్.అంటూ వేరే షాప్ వైపు వెళ్లాడు.)

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube