ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావడంతో సినీ సెలబ్రిటీల మరియు సామాన్యులకి మధ్య దూరం బాగా తగ్గిపోయింది.దీనికితోడు కొందరు సినీ సెలబ్రిటీలు తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం అలాగే లైవ్ మరియు చర్చా కార్యక్రమాలు నిర్వహించడం వంటి వాటి ద్వారా తన అభిమానులకు బాగానే అందుబాటులో ఉంటున్నారు.
కాగా బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇప్పుడిప్పుడే అడుగు పెట్టి పలు రకాల ఫోటో షూట్లు మరియు హాట్ హాట్ వీడియోలతో బాగానే గుర్తింపు తెచ్చుకుంటోంది ప్రముఖ మోడల్ మరియు నటి జీనల్ జోషి.
కాగా ఈ అమ్మడు తాజాగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా లైవ్ కార్యక్రమం నిర్వహించి కొందరు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.
అయితే ఇందులో భాగంగా మీపై “యాసిడ్” దాడి చేస్తే మీరు ఏం చేస్తారంటూ ప్రశ్నించాడు.దీంతో ఈ విషయంపై జీనల్ జోషి స్పందిస్తూ యాసిడ్ దాడి చేయడం వల్ల శారీరకంగా మాత్రమే కాక ఉండా మానసికంగా కూడా కృంగి పోతారని కాబట్టి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని తెలిపింది.
అలాగే ఇతరులని బలవంతంగా తమ జీవితాల్లోకి రావాలనుకోవడం మరియు ఇతరుల సంతోషాన్ని అపహరించాలనుకోవడం చాలా పెద్ద తప్పు అని చెప్పుకొచ్చింది.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం జీనల్ జోషి మోడల్ గా పని చేస్తూనే మరో పక్క సినిమాల్లో హీరోయిన్ గా కూడా అవకాశాల కోసం బాగానే ప్రయత్నిస్తోంది.కానీ అవకాశాలు మాత్రం ఈ అమ్మడికి వరించడం లేదు.కాగా ఇటీవలే జీనల్ జోషి అందాల ఆరబోత కి ఫిదా అయిన కొందరు దర్శక నిర్మాతలు స్పెషల్ సాంగ్స్ లో నటించే అవకాశాలు అఫర్ చేసినప్పటికీ తన సినీ కెరీర్ ని దృష్టిలో ఉంచుకుని సున్నితంగా “నో” చెబుతున్నట్లు సమాచారం.
అలాగే తాజాగా ఈ అమ్మడు ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న బోల్డ్ వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తున్నట్లు పలు కథనాలు వినిపిస్తున్నప్పటికీ జీనల్ జోషి మాత్రం ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించ లేదు.