లవర్ ని ఇంప్రెస్ చెయ్యాలని రైలు పట్టాలపై ఆలా చేసిన ప్రియుడు... చివరికి...- Young Men Try To Impress His Girlfriend And Police Caught In Anantapur

young men try to impress his girlfriend and police caught in Anantapur, Lovers news, Anantapur news, Viral news, Sashidhar, love Breakup, Andhra Pradesh, - Telugu Anantapur News, Andhra Pradesh, Love Breakup, Lovers News, Sashidhar, Viral News, Young Men Try To Impress His Girlfriend And Police Caught In Anantapur

ప్రేమ గుడ్డిది అని ప్రేమ మైకంలో మునిగినన వారు ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారని అప్పుడప్పుడు కొంత మంది ప్రేమికులు చెప్పడం మనం చూస్తుంటాం… అయితే తాజాగా ఓ యువకుడు తను ఘాడంగా ప్రేమించిన ప్రేయసి మెప్పు పొందేందుకు గాను ఏకంగా రైలు పట్టాలపై తనకు తానుగా గాయాలు చేసుకుని నాటకమాడి చివరికి పోలీసులకు చిక్కిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది.

 Young Men Try To Impress His Girlfriend And Police Caught In Anantapur-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోనే కంబదూరు మండలం పరిసర ప్రాంతంలో శశిధర్ అనే ఓ యువకుడు తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.

 ఇతడు గత కొద్ది కాలంగా ఇదే మండలానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఇటీవలే ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

 Young Men Try To Impress His Girlfriend And Police Caught In Anantapur-లవర్ ని ఇంప్రెస్ చెయ్యాలని రైలు పట్టాలపై ఆలా చేసిన ప్రియుడు… చివరికి…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 దీంతో సానుభూతి పొంది మళ్ళీ తన ప్రేయసితో యథావిధిగా మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో స్నేహితుడి సలహా మేరకు దగ్గరలో ఉన్నటువంటి రైలు పట్టాలపై కి వెళ్లి గాయాలు చేసుకుని తనను ఎవరో కిడ్నాప్ చేస్తున్నట్లు బెదిరిస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.

ఈ సెల్ఫీ వీడియోని తన ప్రేయసికి కూడా పంపినట్లు సమాచారం.

ఆ తర్వాత కళ్యాణ దుర్గం మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు.

అయితే అప్పటికే యువకుడి వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వచ్చిన శశిధర్ ని తమదైన శైలిలో విచారించగా తన ప్రేయసి మెప్పు పొందేందుకే తాను ఈ నాటకం ఆడినట్లు ఒప్పుకున్నాడు.

దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో ఈ విషయం తెగ వైరల్ అవుతోంది.అంతేగాక అబద్ధపు నాటకాలు ఆడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

#Sashidhar #Love Breakup #YoungMen #Andhra Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు