అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరిగినపుడు నిజంగా అందరికి ఆశ్చర్యం కలుగుతుంది.అలాంటి సంఘటనలు ఎలా సాధ్యం అనిపిస్తుంది.
ఇదిలా ఉంటే పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో గొప్ప వేడుక.అలాంటి పెళ్లి తన లైఫ్ లో కూడా జరగాలని చాలా మంది కోరుకుంటారు.
కొంత మంది పెళ్లి కావడం లేదని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం.అయితే ఈ పెళ్లి వేడుకలు అప్పుడప్పుడు విచిత్రంగా జరుగుతూ ఉంటాయి.
తాజాగా గుజరాత్ లో జరిగిన ఓ వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.
అసలు విషయంలో వెళ్తే గుజరాత్ లో హిమ్మత్ నగర్ కి అజయ్ అనే ఓ మానసిక వికలాంగుడు చిన్నప్పుడు తల్లిని పోగొట్టుకున్నాడు.
అతని తండ్రి అన్ని అయ్యి అతన్ని పెంచారు.అయితే ఊళ్ళో జరుగుతున్న పెళ్లి వేడుకలు చూసి తనకి కూడా పెళ్లి చేయమని కొడుకు అడగడంతో తండ్రి కొడుకు కోరిక తీర్చడం కోసం నిజంగానే చుట్టాలు, బంధువులకి చెప్పి ఘనంగా పెళ్లి వేడుక చేసారు.
అతనిని పెళ్లి కొడుకులా ముస్తాబు చేసి గుర్రంపై ఊరేగించి పెళ్లి చేసారు.అయితే ఈ పెళ్లిలో విచిత్రం ఏంటంటే ఆ పెళ్లి వేడుకలో పెళ్లి కూతురు లేకుండానే కొడుకు కోసం పెళ్లి తతంగం అంతా చేయడం కొసమెరపు.