మరదలి ప్రేమలో పడిన బావ.. కానీ అత్తామామలు అలా చెయ్యడంతో ....

Young Men Commit Suicide For Love Failure In Medchal

ఈ మధ్య కాలంలో కొందరు ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకుంటూ తమ తల్లిదండ్రుల జీవితాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నారు.కాగా తాజాగా ఓ యువకుడు తన మరదలిని ప్రేమించడంతో అత్తమామలు తమ పెళ్ళికి అంగీకరించలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Young Men Commit Suicide For Love Failure In Medchal-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని తాండూరు మండల పరిసర ప్రాంతంలో సంతోష్ యాదవ్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.అయితే చిన్నప్పటినుంచి సంతోష్ కుటుంబం కొంతమేర ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.

కాగా ఇటీవల కాలంలో సంతోష్ తన మేనత్త కూతురిని ప్రేమించాడు.అయితే యువతికి కూడా సంతోష్ యాదవ్ అంటే ఇష్టం కావడంతో ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.

 Young Men Commit Suicide For Love Failure In Medchal-మరదలి ప్రేమలో పడిన బావ.. కానీ అత్తామామలు అలా చెయ్యడంతో ….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఇతరుల ద్వారా వీరిద్దరి ప్రేమాయణ విషయం యువతి ఇంట్లో తెలియడంతో యువతి తల్లిదండ్రులు సంతోష్ యాదవ్ ని కొంతమేర బెదిరించారు.అంతేకాకుండా మరోమారు తమ కూతురుతో మాట్లాడినట్లు తెలిస్తే హతమారుస్తామని చెప్పడంతో జోష్ ఒక్కసారిగా తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

అంతేగాక తన ప్రియురాలితో గడపలేనటువంటి జీవితం తనకి వద్దని ఊరి చివరన ఉన్నటువంటి చెట్టుకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే అటుగా వెళుతున్నటువంటి కొందరు పశువుల కాపరులు సంతోష్ మృత దేహాన్ని చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

దీంతో చేతికందిన కొడుకు ప్రేమ పేరుతో ఆత్మహత్య చేసుకొని మరణించడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు బోరున విలపించారు.అంతేకాక తమ కొడుకు చావుకి కారణమైనటువంటి మృతుడి మేనత్త, మేనమామ ను కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ ఈ మధ్య కాలంలో కొందరు చీటికీమాటికీ ఆత్మహత్యలు చేసుకుంటూ కన్న వారి జీవితాల్లో తీవ్ర దుఃఖం నింపుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#Commit #Young #Love Failure #YoungCommit #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube