ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయడం లేదని మరిది ఏకంగా వదినని...

ప్రస్తుత కాలంలో కొందరు కామాంధకారంలో మునిగిపోయి వావి వరుసలు మరచి ప్రవర్తిస్తూ చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు.కాగా తాజాగా ఓ యువకుడికి ఎంత చెప్పినా తన కుటుంబ సభ్యులు పెళ్లి చేయడం లేదని ఏకంగా తన అన్న భార్యనే చెర పట్టడానికి ప్రయత్నించి చివరికి తన అన్న చేతిలో దారుణంగా హత్యకు గురైన ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Young Men Brutally Killed For Illegal Affair In Telangana,  Telangana, Crime New-TeluguStop.com

తాజాగా స్థానిక రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా పరిసర ప్రాంతంలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.అయితే ప్రస్తుతం ఈ వ్యక్తికి 30 సంవత్సరాలు పైబడినప్పటికీ కుటుంబ సభ్యులు పెళ్లి చేసే విషయంలో జాప్యం చేశారు.

దీంతో ఈ మధ్యకాలంలో ఈ వ్యక్తి తన అన్న భార్య అయినటువంటి రాణి (పేరు మార్చాం) పై కన్నేశాడు.దీంతో అప్పుడప్పుడు రాణి దగ్గర డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడుతూ ఆమెను శృంగార పరంగా రచ్చగొట్టేవాడు.

ఈ క్రమంలోరాణి పలుమార్లు ఈ విషయం గురించి తన భర్తతో చెప్పడంతో తన తమ్ముడిని మందలించాడు.అయినప్పటికీ మరిది మాత్రం వదిన పట్ల తన వైఖరిని మార్చుకోలేదు.

అయితే తాజాగా మరోమారు ఈ వ్యక్తి పీకలదాకా మద్యం సేవించి వదిన పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు.దీంతో ఈ విషయం రాణి భర్త గమనించి మందలించే ప్రయత్నం చేసినప్పటికీ మరిది మాట వినకపోవడంతో క్షణికావేశంలో చేతికందిన కర్రతో దారుణంగా దాడి చేశాడు.

ఈ గొడవలో రాణి మరిదికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.దీంతో స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి పంచనామా నిమిత్తం తరలించారు.

అలాగే రాణి మరియు ఆమె భర్తను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube