అమెరికాలో ఘోరం..కరోనాతో గేమ్స్ ఆడాడు…ప్రాణాలు కోల్పోయాడు..!!!  

Young man died Corona Virus, Texas, youth games with corona, America, Corona Effect - Telugu America, Corona Effect, Texas, Young Man Died Corona Virus, Youth Games With Corona

కరోనా ఈ పేరు వింటేనే కండలు తిరిగిన మొనగాడికైనా కళ్ళు గిర్రున తిరగాల్సిందే.ఈ మహమ్మారి దెబ్బ ఇప్పటికే పలు దేశాల ప్రజలు రుచి చూసేశారు.

 Young Man Texas Corona Virus

అమెరికా వంటి అగ్ర రాజ్యానికి కరోనా దెబ్బ ఎలా ఉంటుందో సరిగ్గా తెలుసు.అగ్ర రాజ్యమనే అహాన్ని దించాలని కరోనా అమెరికాలో కరాళ నృత్యం చేసిందో ఏమో కానీ మొత్తానికి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిని కబళించింది ఈ మహమ్మారి.

అమెరికాలో ఘోరం..కరోనాతో గేమ్స్ ఆడాడు…ప్రాణాలు కోల్పోయాడు..-Telugu NRI-Telugu Tollywood Photo Image

అయితే ఈ మహమ్మారి అమెరికా వ్యాప్తంగా ఇంతగా వ్యాప్తి చెందుతున్నా కొందరు మాత్రం ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా బయటకి రావడం, మాస్క్ లు ధరించక పోవడం, రోడ్లపై తిరగడం గుంపులు గుంపులుగా ఉండటం చేస్తున్నారు.

కరోనా వస్తుందని చెప్పినా పెడచెవిన పెడుతున్నారు.కరోనా ఏమి చేస్తుందిలె అనుకున్న అమెరికాలోని యువకుడు కరోనాతోనే గేమ్స్ ఆడాడు.చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.కరోనా ఎంతటి ప్రమాద మైన రోగమో వివరిస్తున్న ఓ వైద్యుడు ఓ యువకుడి నిర్లక్ష్యానికి ఎలాంటి శిక్ష అనుభవించాడో తెలిపారు.

యుక్త వయసు వారికి కరోనా సోకినా ఏమి అవదు అనుకోవద్దు అంటూ సదరు వైద్యుడు చెప్పిన ఉదాహరణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టెక్సాస్ కి చెందిన ఓ యువకుల బృందంలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది.అయితే పాజిటివ్ వచ్చిన యువకుడు ఎవరైతే కరోన కి భయపడకుండా ఉంటారో వారు నాతో పార్టీకి రండి అంటూ తన స్నేహితులతో పందెం కాశాడు.దాంతో అతడితో పాటు వెళ్ళిన ఓ యువకుడికి కొద్ది రోజుల్లోనే కరోనా పాజిటివ్ అని తేలింది.

అయితే కరోనా వచ్చిన యువకుడికి కొద్ది రోజుల్లోనే ఊపిరితిత్తులు పనిచేయకుండా పోయాయి.గాలి పీల్చడం ఎంతో కష్టంగా అనిపించింది.దాంతో తానూ తప్పు చేశానని భావించిన అతడు చనిపోయే కొన్ని గంటల ముందు అక్కడి వైద్యులతో నేను తప్పు చేశాను అంటూ ప్రాణాలు విడిచి పెట్టాడట.భాద్యత లేకుండా కరోనా ఏమి చేస్తుందిలే అని రోడ్లపై తిరగడం వలనే కరోనా మహమ్మారి ప్రభలుతోందని ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.

#America #Texas #Corona Effect

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Young Man Texas Corona Virus Related Telugu News,Photos/Pics,Images..