కరోనా భయం.. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై యువకుడి మృతి

కరోనా వైరస్.మానవత్వం లేకుండా చేస్తుంది.

 Young Man Sudden Demise Ecil Cross Roads Hyderabad,ecil Cross Roads, Hyderabad,-TeluguStop.com

పక్కన దగ్గు, జలుబు ఉన్న వ్యక్తి ఉన్నాడు అంటే చాలు ఆగకుండా పరిగెత్తుతారు.ఒకప్పుడు ఒక మనిషి రోడ్డుపై పడిపోతే ఎలాగోలా సాయం అందించేవారు.

కానీ ఇప్పుడు మనిషి పడిపోయాడు అంటే పరిసరాల్లో ఉండకుండా వెళ్లిపోతున్నారు.ఇంకా ఇప్పుడు ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.హైదరాబాద్ జవహర్ నగర్ కు చెందిన పృథ్వీరాజ్‌ అనే యువకుడు గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు.దీంతో స్థానికంగా ఉండే జీనియా ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.అయితే అక్కడ వైద్య సిబ్బంది సరైన వైద్యం అందించకపోగా వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలి అని సూచించారు.

దీంతో ఆ యువకుడుని మరో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బయటకురాగా అందరూ చూస్తుండగానే ఆ యువకుడు రోడ్డుపై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.అయితే అక్కడికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఆ యువకుడు మృతి చెందినట్టు 108 సిబ్బంది నిర్ధారించారు.

అయితే యువకుడిని ఆస్పత్రికి తరలించేందుకు సాయం కోసం ఎంత అర్థించినా ఎవరూ ముందుకురాలేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.కాగా ఈ కరోనా కాలంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube