పబ్జీ ఆడొద్దని చెప్పినందుకు యువకుడు ఏకంగా…  

Young man, Suicide News, Pubg game, Crime news, Visakhapatnam, Andhra Pradesh, Man Suicide Because Mother scolds - Telugu Andhra Pradesh, Crime News, Man Suicide Because Mother Scolds, Pubg Game, Suicide News, Visakhapatnam, Young Man

ప్రస్తుత కాలంలో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల మంచి కోసం చెప్పినప్పటికీ  ఆ విషయం అర్థం చేసుకోకుండా కొంత మంది పిల్లలు అవగాహన లేకుండా తీసుకునేటువంటి కఠిన నిర్ణయాల కారణంగా తల్లిదండ్రుల జీవితంలో తీవ్ర విషాదం నిండుతోంది.తాజాగా ఓ యువకుడు తన తల్లి పబ్జి గేమ్ ఆడవద్దని, చక్కగా పని చేసుకోమని చెప్పినందుకే ఓ యవకుడు ఏకంగా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది.

TeluguStop.com - Young Man Commits Suicide For Telling To Stop Playing Pubg Game

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లా పరిసర ప్రాంతంలో హమీద్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.కాగా ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై అధికంగా ఉన్నటువంటి ఓ మొబైల్ షాప్ లో సెల్ఫోన్ రిపేరింగ్ పని చేస్తున్నాడు.

అయితే ఈ మధ్య కాలంలో పని తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ సమయం ఇంటి వద్దనే ఉంటున్నాడు.ఈ క్రమంలో పబ్జీ గేమ్ ఆడడం వ్యసనంగా మార్చుకున్నాడు.

TeluguStop.com - పబ్జీ ఆడొద్దని చెప్పినందుకు యువకుడు ఏకంగా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో ఈ మధ్యనే హమీద్ తల్లి పబ్జి గేమ్ ఆడడం మానేసి ఏదైనా పని చూసుకోమని ఇల్లు గడవడం కష్టంగా ఉందని కొంతమేర మందలించింది.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన హమీద్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఇందులో భాగంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గదిలోకి వెళ్లి ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఇది గమనించిన మృతుడి తల్లి వెంటనే స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించి.

సమాచారం అందుకున్న  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు.అలాగే మృతుడి తల్లి తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

#Andhra Pradesh #ManSuicide #Visakhapatnam #Young Man #Pubg Game

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Young Man Commits Suicide For Telling To Stop Playing Pubg Game Related Telugu News,Photos/Pics,Images..