జ్వరాన్నికరోనా వైరస్ అనుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు...  

young man commits suicide by fearing about corona virus - Telugu Chittoor, Chittoor Crime News, Chittoor Latest News, Chittoor Local News, Chittoor News, Corona Virus, Corona Virus Latest News, Corona Virus News

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కారణం వైరస్ కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఇందులో భాగంగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడి 40 వేల పైచిలుకు మంది మరణించగా మరో రెండు లక్షల మందికి పైగా ఈ వైరస్ లక్షణాలతో బాధపడుతున్నారు.

Young Man Commits Suicide By Fearing About Corona Virus

అయితే తాజాగా ఓ యువకుడు తనకు కరోనా వైరస్ సోకిందని కచ్చితంగా చనిపోతాననే భయంతో తనంతట తానే ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే బాలకృష్ణ అనే యువకుడు జిల్లాలోని శేషమనాయుడు కండ్రిగ గ్రామంలో నివాసం ఉంటున్నాడు.

గత కొద్ది రోజులుగా వైరల్ జ్వరం, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నాడు.అయితే ఈ క్రమంలో చికిత్స నిమిత్తమై తిరుపతిలోని రుయా ఆసుపత్రికి వెల్లాడు.దీంతో వైద్యులు జ్వరం దగ్గుకి సంబంధించినటువంటి చికిత్స చేసి ఇంటికి పంపించారు.అయినప్పటికీ జ్వరం తగ్గక పోవడంతో కరోనా  వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని తనలో తానే భయపడుతూ మానసిక వేదనకు గురయ్యాడు.

దీంతో తన కుటుంబ సభ్యులను కూడా తన వద్దకు రావద్దంటూ తనని తానే ఓ గదిలో నిర్బంధించుకున్నాడు.అనంతరం నిన్నటి వేకువజామున పొలానికి వెళ్లి తన పొలంలోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఇది గమనించినటువంటి చుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు.

అలాగే స్థానికులు తెలిపిన టువంటి వివరాలను ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  

.

#Corona Virus #Chittoor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Young Man Commits Suicide By Fearing About Corona Virus Related Telugu News,Photos/Pics,Images..