ఆ కంపెనీలకు నో చెబుతున్న యంగ్ టైగర్.. కారణమేమిటంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేసి ఎవరు మీలో కోటీశ్వరులు షోతో బిజీగా ఉంటూ త్వరలో కొరటాల శివ సినిమా పనులను మొదలుపెట్టాలని భావిస్తున్నారు.ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మూవీ స్టూడెంట్ లీడర్ కాన్సెప్ట్ తో తెరకెక్కనుండగా ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మరో సినిమాకు ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారు.

 Young Junior Ntr Said No To New Brand  Endorsements, Brand Endorsements, Evaru M-TeluguStop.com

అయితే ఈ రెండు సినిమాలు కాకుండా ఎన్ని ఆఫర్లు వస్తున్నా ఎన్టీఆర్ మాత్రం ఓకే చెప్పడం లేదు.

ఎన్టీఆర్ హీరోగా వెట్రిమారన్ డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

అయితే ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది.ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాతనే ఎన్టీఆర్ కొత్త సినిమాలకు, బ్రాండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఇస్తారని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాత ఇతర భాషల్లో వచ్చే గుర్తింపును బట్టి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందడుగులు వేయనున్నారని తెలుస్తోంది.

ఆ తర్వాత ఏ జానర్ లో సినిమాలు చేయాలో పాన్ ఇండియా సినిమాలు చేయాలో లేక తెలుగు సినిమాలు చేయాలో ఎన్టీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.

Telugu Evarumeelo, Koratala Siva, Pan India, Rajamouli, Tollywood-Movie

ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తానని ఎన్టీఆర్ చెబుతున్నారు.ప్రస్తుతం మ్యూట్ మూడ్ లో ఉన్న ఎన్టీఆర్ కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.బాహుబలి ప్రభాస్ కు పాన్ ఇండియా హీరో గుర్తింపును సంపాదించిపెట్టింది.

Telugu Evarumeelo, Koratala Siva, Pan India, Rajamouli, Tollywood-Movie

ప్రభాస్ లా పాన్ ఇండియా హీరో ఇమేజ్ ను సాధించాలని ఎన్టీఅర్ ఆశిస్తుండగా ఎన్టీఆర్ కోరిక ఆర్ఆర్ఆర్ తో తీరుతుందో లేదో చూడాల్సి ఉంది.ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా ఇమేజ్ వస్తుందని బలంగా నమ్ముతుండగా ఎన్టీఆర్ నమ్మకాన్ని రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube