భారతీయ అమెరికన్లపై జాతి వివక్ష, ప్రీ స్కూల్‌ దశలోనే బీజాలు : సర్వేలో సంచలన విషయాలు

అమెరికాలో నివసిస్తున్న 3.5 మిలియన్లకు పైగా దక్షిణాసియా వాసులలో వున్న యువ భారతీయ అమెరికన్లు ప్రీ స్కూల్‌ దశతలోనే జాతి వివక్షను ఎదుర్కొంటున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.ఇది వారి అభివృద్ధిని, గుర్తింపును తీవ్రంగా ప్రభావతం చేస్తుందని అధ్యయనం తెలిపింది.టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ 12 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసు గల భారతీయ అమెరికన్లను సర్వే చేసింది.

 Young Indian-americans Face Race Bias As Early As Preschool  Study , Texas , A&m-TeluguStop.com

ఈ సందర్భంగా వారు పాఠశాలలో తోటివారితో తమ అనుభవాల గురించి మాట్లాడారు.భారతీయ సంస్కృతి, భాష , మతం వివక్షపూరిత వ్యాఖ్యలపై స్పందించారు.

పాఠశాలలో ఒక బండను చూపించి ఇదిగో ఇది నీ దేవుడు అని వెక్కిరించారని, చుక్కల్ని లెక్కపెట్టే సమయంలో ఇది నీ దేవుడా అని తమను ఎగతాళి చేశారని ఓ భారతీయ అమెరికన్ విద్యార్ధి ఆవేదన వ్యక్తం చేశాడు.ఆ సమయంలోనే తమపై ద్వేషపూరిత నేరాలు కూడా జరిగినట్లు చెప్పారు.

మరికొందరు తమ చర్మం స్నేహితుల వలే తెల్లగా ఎందుకు లేదని బాధపడినట్లు పేర్కొన్నారు.ఇండియన్ అమెరికన్ అనే పదం.రెండు ప్రపంచాల మధ్య జీవిస్తున్నారని తమకు చెబుతోందని ఓ విద్యార్ధి అన్నాడు.తాను ఇంటికి వస్తే భారతీయ ఆహారాన్ని తింటూ, భారతీయ జీవితాన్ని గడుపుతానని.

కానీ పాఠశాలకు వెళ్తే తానొక అమెరికన్‌ని అని ఆ విద్యార్ధి చెప్పాడు.

జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం అమెరికాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.భారతీయ అమెరికన్ యువత ప్రీ స్కూల్ లేదా ఎలిమెంటరీ స్కూల్‌లోనే వివక్షను ఎదుర్కోవడం ప్రారంభిస్తారని అధ్యయనం పేర్కొంది.భారతీయ తల్లిదండ్రులకు అమెరికాలో పుట్టిన వారిని రెండవ తరం ఇండో అమెరికన్లుగా వర్గీకరించారు.

భారతీయులు 1800ల చివరిలో యూఎస్‌కు వలస వచ్చిన తొలి దక్షిణాసియా వాసులు, ప్రస్తుతం వీరు అమెరికాలో అతిపెద్ద జాతి సమూహం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube