ఇండస్ట్రీలో కొనసాగలేవని భయపెట్టారు.. తాప్సీ సంచలన వ్యాఖ్యలు..!

రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఝుమ్మంది నాదం సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టారు తాప్సీ.ఆ సినిమా తరువాత వస్తాడు నారాజు, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్, వీర, మొగుడు, దరువు, షాడో, గుండెల్లో గోదారి మరికొన్ని సినిమాల్లో నటించి నటిగా తాప్సీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.

 Young Heroine Taapsee Pannu Sensational Comments In An Interview, Taapsee Pannu,-TeluguStop.com

గత కొన్నేళ్లుగా టాలీవుడ్ కు దూరమైన తాప్సీ బాలీవుడ్ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన తాప్సీ తాను లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన తరువాత గ్లామర్ పాత్రల్లో తాను ఎక్కువగా నటించానని.గ్లామర్ పాత్రల్లో నటించడం ద్వారా తక్కువ సమయంలో గుర్తింపు వస్తుందని భావించానని అయితే ఆ విధంగా జరగలేదని తాప్సీ తెలిపారు.

ఆ పాత్రలు తనకు పెద్దగా సంతృప్తిని కూడా ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు.

Telugu Jummandi Nadham, Lady, Sensatioanl, Taapsee Lady, Taapsee Pannu, Thapad,

ఆ తరువాత గ్లామర్ పాత్రల కంటే మనసుకు నచ్చిన పాత్రల్లోనే నటించాలని అనుకున్నానని ప్రస్తుతం అలాంటి పాత్రలనే ఎంపిక చేసుకుంటున్నానని తాప్సీ అన్నారు.మనస్సుకు నచ్చిన లేడీ ఓరియెంటెడ్ సినిమా కథలను ఎక్కువగా ఎంపిక చేసుకుంటుంటే అలాంటి పాత్రల్లో నటిస్తే హీరోయిన్ గా కెరీర్ ను తాను ఎక్కువ కాలం కెరీర్ ను కొనసాగించలేనని కొందరు హెచ్చరించారని పేర్కొన్నారు.

లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తే హీరోలకు జోడీగా అవకాశాలు కూడా రావని భయపెట్టారని తాప్సీ పేర్కొన్నారు.

అయితే తాను మాత్రం ఇతరుల మాటలను పట్టించుకోలేదని తాప్సీ అన్నారు.తాప్సీ ప్రస్తుతం తమిళంలో జనగణమన, విజయ్ సేతుపతితో మరో సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాలే కాకుండా తాప్సీ చేతిలో హసీన్ దిల్‌రూబా, రష్మి రాకెట్ మరో సినిమాలో నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube