తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు కష్టపడుతున్న యంగ్ బ్యూటీ.. కానీ...

తెలుగులో ప్రముఖ దర్శకుడు సత్యం చల్లకోటి దర్శకత్వం వహించిన “ఓయ్ నిన్నే” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి  తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న మలయాళ బ్యూటీ “సృష్టి దంగే” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 Young Heroine Srushti Dange Weight Loss For Movie Offers In In Tollywood-TeluguStop.com

అయితే నటన పరంగా ఈ అమ్మడికి ఎంతో మంచి ప్రతిభ ఉన్నప్పటికీ కానీ ఇప్పటివరకు ఈ అమ్మడికి తన నటనా ప్రతిభను నిరూపించుకునే అవకాశం రాకపోవడంతో సరైన హిట్ ని దక్కించుకోలేక పోయింది.

 దీనికితోడు ఇప్పటివరకు ఈ అమ్మడు నటించిన సినిమాలలోని పాత్రలకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఈ అమ్మడిని ఎవరూ గుర్తించలేదు.

 Young Heroine Srushti Dange Weight Loss For Movie Offers In In Tollywood-తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు కష్టపడుతున్న యంగ్ బ్యూటీ.. కానీ…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో సృష్టి దంగేదాదాపుగా మూడేళ్ల కాలం పాటు తెలుగులో సినిమాలలో నటించలేదు.

 దీంతో సృష్టి దంగే మళ్లీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ మధ్య కాలంలో కొంత మేర బరువు పెరిగి  బొద్దుగా తహయారైంది.

దీంతో ఈ భామ ప్రస్తుతం బరువు తగ్గేందుకు జిమ్ లో వర్కౌట్లు  చేస్తూ బాగానే కష్ట పడుతోంది. అంతేగాకతాను వర్కౌట్లు చేస్తున్న సమయంలో తీసినటువంటి ఫోటోలు, వీడియోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్  చేస్తోంది.

ఈ విషయం ఇలా ఉండగా సృష్టి దంగేతెలుగులో చివరగా “వైఫ్ ఆఫ్ రామ్” అనే చిత్రంలోని ఓ  పాత్రలో కనిపించింది.అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు.కాగా ప్రస్తుతం తమిళంలో ఎమ్మెస్.ఆనందన్ దర్శకత్వం వహిస్తున్న “చక్ర” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

#Young Heroine #SrushtiDange #Srushti Dange #YoungHeroine #OyNinne

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు