కుర్ర హీరోయిన్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్న మాస్ మహారాజా...

తెలుగులో ఎప్పుడూ వైవిధ్య భరితమైన కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులని అలరించేటువంటి టాలీవుడ్ ప్రముఖ హీరో “మాస్ మహారాజా రవి తేజ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ ఏడాది ప్రముఖ దర్శకుడు “గోపీచంద్ మలినేని” దర్శకత్వం వహించిన “క్రాక్” అనే చిత్రం ద్వారా మంచి హిట్ అందుకుని శుభారంభం చేశాడు.

 Young Heroine Sree Leela Bagged Another Movie Offers In Tollywood-TeluguStop.com

కాగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపుగా 70 కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించి దర్శక నిర్మాతలకు కాసుల పంట పండించింది.దీంతో రవి తేజ కూడా వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు.

కాగా ప్రస్తుతం తెలుగులో త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలో హీరోగా నటించడానికి రవి తేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.కాగా ఈ చిత్రంలో రవి తేజ కి జోడీగా కన్నడ బ్యూటిఫుల్ హీరోయిన్ అయిన శ్రీ లీల ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

 Young Heroine Sree Leela Bagged Another Movie Offers In Tollywood-కుర్ర హీరోయిన్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్న మాస్ మహారాజా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఇప్పటికే నటి శ్రీ లీల తెలుగులో నూతన దర్శకురాలు గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్న పెళ్లి సందD చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.అయితే రవి తేజ మరియు త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం శ్రీ లీల దాదాపుగా 50 లక్షల రూపాయల నుంచి 75 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నట్లు కూడా కొందరు చర్చించుకుంటున్నారు.

దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ రవి తేజ ప్రతి సినిమాకి యంగ్ హీరోయిన్లను ఎంకరేజ్ చేస్తున్నాడని ఇది చాలా అభినందించదగ్గ విషయమని కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రవి తేజ “ఖిలాడీ” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రానికి తెలుగు ప్రముఖ దర్శకుడు “రమేష్ వర్మ” దర్శకత్వం వహిస్తున్నాడు.ఇటీవలే ఈ చిత్రానికి కొంతమేర బడ్జెట్ సమస్యలు తలెత్తినట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

అయితే రవి తేజ హీరోగా నటిస్తున్న మరో చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ”.ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.

#Kannada Young #Pelli SandaD #YoungSree #Raviteja #Sree Leela

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు