ప్రయోగాలు చేస్తున్న రష్మిక.. స్టార్ కెరీర్ నిలబెట్టుకోగలదా?

రష్మిక మందన్నా ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నటువంటి హీరోయిన్ లలో ఒకరు అని చెప్పవచ్చు.తెలుగు చిత్రాలతో పాటు హిందీ చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

 Young Heroine Rashmika Mandana Doing Experiments In Bollywood Industry-TeluguStop.com

ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే రెండు సినిమాలలో నటిస్తూ ఉండగా తాజాగా ఈ బ్యూటీ మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.శంతను బాగ్చి దర్శకత్వం వహిస్తున్నటువంటి మిషన్ మజ్ను చిత్రంలో సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి నటించనున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంది.

 Young Heroine Rashmika Mandana Doing Experiments In Bollywood Industry-ప్రయోగాలు చేస్తున్న రష్మిక.. స్టార్ కెరీర్ నిలబెట్టుకోగలదా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అదేవిధంగా వికాస్ బహల్ దర్శకత్వం గుడ్ బాయ్ సినిమాలో కూడా రష్మిక నటిస్తున్నారు ఇందులో అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షెడ్యూల్స్ సాగుతుండగా.రష్మిక మరొక ప్రాజెక్టుకు సంతకం చేశారు.ఇలా వరస ప్రాజెక్టులతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రయోగాలు చేస్తున్నటువంటి ఈమెను చూస్తూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నప్పటికీ మరికొందరు తన కెరియర్ ను నిలబెట్టుకోగలదా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Telugu Allu Arjun, Amitab Bachchan, Bollywood Industry, Experiments, Pooja Hegde, Pushpa, Rashmika In Bollywood, Rashmika Mandanna, Rashmika Mission Majnu, Siddharth Malhotra, Tollywood-Movie

ఇక తెలుగులో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్నటువంటి పుష్ప సినిమాలో రష్మిక అల్లు అర్జున్ సరసన నటిస్తున్నారు.అదేవిధంగా పుష్ప పార్ట్ వన్ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఐకాన్ సినిమా చేస్తున్నట్లు సమాచారం వినబడుతోంది.ఇందులో కూడా కథానాయికగా రష్మికా పేరు వినిపిస్తోంది.

ఇకపోతే ఐకాన్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని ఒకరు రష్మికా కాగా మరొకరు పూజా హెగ్డేను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ సమాచారం.మరి ఇది ఎంతవరకు నిజం అనే విషయం చిత్ర బృందం అధికారికంగా వెల్లడించాల్సి ఉంటుంది.

#Rashmika Majnu #Pooja Hegde #Allu Arjun #Pushpa #Amitab Bachchan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు