కరోనా వ్యాక్సిన్ తీసుకొమ్మని సూచిస్తున్న యంగ్ హీరోయిన్...

తెలుగులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “జెంటిల్మెన్” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా హీరోయిన్ గా పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ “నివేథ థామస్” గురించి టాలీవుడ్ సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నివేథ థామస్ ఇటీవలే  తెలుగులో పవర్ స్టార్  “పవన్ కళ్యాణ్” హీరోగా నటించిన “వకీల్ సాబ్” చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి బాగానే ఆకట్టుకుంది.

 Young Heroine Nivetha Thomas Suggest Taking Corona Vaccine, Nivetha Thomas, Youn-TeluguStop.com

దీంతో ఈ అమ్మడికి సినిమా అవకాశాలు బాగానే తలుపు తడుతున్నట్లు సమాచారం.

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ ను నిలిపి వేయడంతో నివేథ థామస్ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.

ఇందులో భాగంగా తాజాగా నివేథ థామస్ తాను కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపింది అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఇలా చేయడం వల్ల తమ కుటుంబ సభ్యులతోపాటు ఇతరులను కూడా సురక్షితంగా ఉంచవచ్చని సూచించింది.అలాగే ఇటీవల “ఫాదర్స్ డే” సందర్భంగా చిన్నప్పుడు తన తండ్రి తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ “పితృ దినోత్సవ” శుభాకాంక్షలు తెలిపింది.

Telugu Corona, Covid Vaccine, Nivetha Thomas, Tollywood, Young, Youngnivetha-Mov

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నివేథ థామస్ తెలుగులో “మిడ్ నైట్ రన్నర్స్” చిత్ర రీమేక్ లో హీరోయిన్ గా నటిస్తోంది.ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ ను నిలిపి వేయడంతో ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు కొంతకాలంపాటు తాత్కాలికంగావాయిదా వేసినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube