అరియానా గ్లోరీ ఒరిజినల్ నేమ్ ఏంటో తెలుసా..?

సాధారణంగా సినిమా, టీవీ ఇండస్ట్రీలలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత చాలామంది హీరోలు, హీరోయిన్లు తమ పేర్లను మార్చుకున్న సంగతి తెలిసిందే.కొంతమంది అదృష్టం కోసం పేరును మార్చుకుంటే మరి కొంతమంది మాత్రం పాపులారిటీ కోసం పేర్లను మార్చుకుంటూ ఉంటారు.

 Young Heroine Ariyana Glory Original Name Details-TeluguStop.com

బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న అరియానా గ్లోరీ అసలు పేరు అర్చన.అయితే ఇండస్ట్రీలో గుర్తింపును సంపాదించుకోవాలని ఆమె తన పేరును మార్చుకున్నారు.

బిగ్ బాస్ షో సీజన్ 4 టెలీకాస్ట్ అయిన సమయంలో నాగార్జున అడిగినా అరియానా గ్లోరీ తన అసలు పేరును చెప్పలేదు.మరోవైపు సోషల్ మీడియాలో ఈ బ్యూటీ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కొత్త ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు.

 Young Heroine Ariyana Glory Original Name Details-అరియానా గ్లోరీ ఒరిజినల్ నేమ్ ఏంటో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగమ్మాయిలు గ్లామరస్ రోల్స్ కు దూరంగా ఉంటారని చాలామంది నిర్మాతలు భావిస్తారు.కానీ అరియానా మాత్రం అవకాశం ఇస్తే తెలుగమ్మాయిలు గ్లామరస్ రోల్స్ లో కూడా అద్భుతంగా నటించగలరని ప్రూవ్ చేస్తున్నారు.

Telugu Ariyana Glory, Jabardast Avinash, Mall Opening Offers, Original Name-Movie

ఆర్జీవీని అరియానా గ్లోరీ ఇంటర్య్వూ చేసిన సమయంలో వర్మ అరియానాపై చేసిన కామెంట్లు ఆమెకు పాపులారిటీని తెచ్చిపెట్టాయి.అరియానా తెలంగాణలోకి తాండూరుకు చెందిన అమ్మాయి కాగా హైదరాబాద్ కు వచ్చిన తర్వాత గుర్తింపును సొంతం చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డారు.అవినాష్ తో ప్రేమాయణం ద్వారా ఈ బ్యూటీ వార్తల్లో నిలిచారు.తెలుగులో ఈమెకు హీరోయిన్ గా కూడా ఆఫర్లు బాగానే వస్తున్నాయి.

అర్చన పేరు అరియానాగా మార్చుకున్న తరువాత అరియానాకు లక్ కలిసిరావడంతో పాటు ఆఫర్లు సైతం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.హీరోయిన్ గా అరియానా నటిస్తున్న సినిమాలు హిట్టైతే ఆమె కెరీర్ పుంజుకునే అవకాశం ఉంటుంది.

రాజ్ తరుణ్ కు జోడీగా అరియానా ఒక సినిమాలో నటిస్తుండగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లకు కూడా అరియానాకు బాగానే ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.

#Ariyana Glory #MallOpening #Original Name

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు