హీరోయిన్ అనుపమ ముద్దుపేరు ఏంటో తెలుసా..?

మల్లూవుడ్ ఇండస్ట్రీ నుంచి తెలుగు తెరపై అడుగు పెట్టి నటిగా గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు అనుపమ పరమేశ్వరన్.ప్రస్తుతం నిఖిల్ కు జోడీగా 18 పేజెస్ అనే సినిమాలో నటిస్తున్న అనుపమకు ఈ సినిమా మినహా చేతిలో మరే సినిమా లేదు.అమాయకపు చూపులతో అందమైన నవ్వుతో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న అనుపమ అభినయంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

 Young Heroine Anupama Parameshwaran Nick Name Details-TeluguStop.com

1996 సంవత్సరంలో జన్మించిన అనుపమ చిన్న వయస్సులోనే హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టి నటిగా అంతకంతకూ ఎదుగుతున్నారు.గ్లామర్ పాత్రల కంటే అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలనే అనుపమ ఎంచుకుంటున్నారు.దూరవిద్య ద్వారా డిగ్రీ చేసిన అనుపమ ముద్దుపేరు పొన్ను.అనుపమ కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు సైతం ఆమెను పొన్ను అని పిలిచేవారు.మలయాళంలో పొన్ను అనగా బంగారం అని అర్థం.

ఫ్రెండ్ బలవంతం చేయడం వల్ల మలయాళ ప్రేమమ్ సినిమాలోని పాత్ర కోసం ఫోటోలు పంపిన అనుపమ ఆ పాత్రకు ఎంపిక కావడం, ఆ మూవీ ఊహించని స్థాయిలో సక్సెస్ కావడంతో సౌత్ ఇండియా అంతటా అనుపమకు మంచి పేరు వచ్చింది.19 సంవత్సరాల వయస్సులోనే ప్రేమమ్ మూవీతో నటప్రస్థానాన్ని ప్రారంభించిన అనుపమ తెలుగు సినిమాల్లో తను నటించిన కొన్ని పాత్రలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు.

 Young Heroine Anupama Parameshwaran Nick Name Details-హీరోయిన్ అనుపమ ముద్దుపేరు ఏంటో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే స్టార్ హీరోల సరసన అనుపమకు నటించే ఛాన్స్ రాకపోవడంతో ఆమె కెరీర్ కు ఆ సినిమా పెద్దగా ప్లస్ కాలేదు. 18 పేజెస్ కాకుండా మరికొన్ని తెలుగు సినిమాల్లో అనుపమ నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నా అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది.

సింగింగ్, పెయింటింగ్ ను అనుపమ ఎక్కువగా ఇష్టపడతారు.నటిగా సౌత్ ఇండియా అంతటా గుర్తింపు తెచ్చుకున్న అనుపమ ఒక సినిమాకు సహాయ దర్శకురాలిగా కూడా పని చేయడం గమనార్హం.

#Young Heroine #Ponnu #YoungHeroine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు