మాస్క్ లో ఉన్న ఈ స్టార్ హీరోయిన్ ను గుర్తు పట్టారా..?

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోని సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు అనుపమ పరమేశ్వరన్.ప్రస్తుతం అనుపమ నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 18 పేజెస్ సినిమాలో నటిస్తున్నారు.

 Young Heroine Anupama  Parameshwaran Looks Like Vijay Devarakonda In Mask , Anup-TeluguStop.com

అ ఆ, ప్రేమమ్, శతమానం భవతి సినిమాల్లో అనుపమ నటనకు మంచి పేరు వచ్చింది.అయితే ఈ హీరోయిన్ తాజాగా సరికొత్త లుక్ లో దర్శనమిచ్చింది.

దూరం నుంచి చూస్తే ఆ ఫోటోలో అనుపమ లేడీ విజయ్ దేవరకొండలా కనిపిస్తున్నారు.
రంగురంగుల జుట్టుతో, సరికొత్త హెయిర్ స్టైల్ తో, వేర్వేరు క్యాస్టూమ్స్ వేసుకుని అనుపమ లేడీ విజయ్ దేవరకొండలా కనిపిస్తున్నారు.

కొందరు నెటిజన్లు అనుపమ ఫోటోను చూసి ఆమె విజయ్ దేవరకొండ డూప్ అని కామెంట్లు చేస్తున్నారు.కెరీర్ మొదట్లో ఆఫర్లు బాగా అందుకున్న అనుపమ పరమేశ్వరన్ కు ఈ మధ్య కాలంలో సరైన ఆఫర్లు రావడం లేదు.

సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న అనుపమ పరమేశ్వరన్ తరచూ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను పెంచుకుంటున్నారు.సోషల్ మీడియాలో అనుపమ షేర్ చేస్తున్న ఫోటోలను ఆమె అభిమానులు కావడంతో పాటు ఆ ఫోటోలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మిడిల్ రేంజ్ హీరోలు అనుపమ పరమేశ్వరన్ కు ఎక్కువగా అవకాశాలు ఇస్తూ ఉండటం గమనార్హం.

తెలుగుతో పాటు శాండిల్ వుడ్, మల్లూవుడ్ ఆఫర్ల కోసం అనుపమ ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.

తెలుగమ్మాయిలా కనిపించే అనుపమ పరమేశ్వరన్ కు 18 పేజెస్ సినిమా హిట్టైతే మాత్రమే మళ్లీ కెరీర్ లో వరుస సినిమా ఆఫర్లతో బిజీ అయ్యే అవకాశం ఉంది.ఈ ఏడాదే 18 పేజెస్ సినిమా విడుదల కానుండగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube