అప్పుడు మొహం చాటేసిన వాళ్లు ఇప్పుడు ఫోన్‌ ల మీద ఫోన్‌ లు చేస్తున్నారట  

young heroes want to do a film with gopichand malineni, gopichand malineni, raviteja, krack movie director, mega hero, young heroes - Telugu Gopichand Malineni, Krack Movie, Krack Movie Director, Mega Hero, Raviteja, Telugu Film News, Tollywood Movie, Young Heroes, Young Heroes Want To Do A Film With Gopichand Malineni

టాలీవుడ్‌ లో అయినా మరే ఇండస్ట్రీలో అయినా ఫ్లాప్ ల్లో ఉన్న దర్శకులను పట్టించుకునే వాళ్లు ఉండరు.అదే ఒక్క సూపర్ హిట్‌ కొట్టారు అంటే ఖచ్చితంగా ఆ దర్శకుడి వెంట పడటం చాలా కామన్ గా కనిపిస్తు ఉంటుంది.

TeluguStop.com - Young Heroes Want To Do A Film With Gopichand Malineni

వరుసగా ప్లాప్‌ సినిమాలు చేస్తే ఆ దర్శకులతో ఏ హీరో కూడా చేసేందుకు ఆసక్తి చూపించడు.చాలా నమ్మకం ఉంటే తప్ప ఆ దర్శకుడికి హీరో ఛాన్స్ ఇస్తారు.

దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించేందుకు చాలా మంది హీరోలు నో చెప్పారు.ఆయన తెరకెక్కించిన గత సినిమా నిరాశ పర్చడంతో పాటు చాలా పూర్‌ కథ అంటూ విమర్శలు రావడంతో అసలు ఆయన దర్శకత్వంలో నటించేందుకు చిన్న హీరోల నుండి స్టార్‌ హీరోల వరకు అంతా కూడా నో చెప్పారు.

TeluguStop.com - అప్పుడు మొహం చాటేసిన వాళ్లు ఇప్పుడు ఫోన్‌ ల మీద ఫోన్‌ లు చేస్తున్నారట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కనీసం కథ చెప్పందుకు కూడా టైం ఇవ్వకుండా పలువురు యంగ్‌ హీరోలు మొహం చాటేశారు అంటూ గోపీచంద్‌ మలినేని సన్నిహితులు చెబుతూ ఉన్నారు.ఇప్పుడు అదే గోపీచంద్‌ మలినేని కి యంగ్‌ హీరోలు ఫోన్ ల మీద ఫోన్‌ లు చేస్తూ సినిమా చేద్దామని అడుగుతున్నారట.

ఈ విషయంలో ప్రస్తుతం టాలీవుడ్‌ వర్గాల వారు ఆసక్తికర చర్చ జరుగుతోంది.తనకు గతంలో నో చెప్పిన ఏ ఒక్క హీరోతో ప్రస్తుతం సినిమా చేసేందుకు గోపీచంద్‌ ఆసక్తిగా లేడట.ఆ విషయంలో ఇప్పటికే క్లారిటీ ఇవ్వడం జరిగింది.తన తదుపరి సినిమాను కూడా తనకు క్రాక్‌ ఛాన్స్ ఇచ్చిన రవితేజతో చేయాలని భావిస్తున్నాడట.అందుకు తగ్గట్లుగా కథను రెడీ చేసే పనిలో గోపీచంద్‌ మలినేని ఉన్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఒక మెగా హీరోతో కూడా గోపీచంద్‌ సినిమా చేయాలని భావిస్తున్నాడు.

ఆ హీరో తన కెరీర్‌ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు అంటూ ఆయన భావిస్తున్నాడు.అందుకే వీరిద్దరి తర్వాతే ఇతర హీరోలతో సినిమాల విషయం ఆలోచిస్తాను అంటూ గోపీచంద్‌ సన్నిహితుల వద్ద అంటున్నాడట.

#Raviteja #Young Heroes #YoungHeroes #KrackMovie #Mega Hero

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు