కొరటాల శివ కోసం పోటీ పడుతున్న యంగ్ హీరోలు...

ఇక ప్రస్తుతం కొరటాల శివ( Koratala Shiva ) ఎన్టీఆర్ తో దేవర( Devara ) అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా భారీ యాక్షన్ సినిమా గా రూపొందుతుంది.

ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ మీడియం రేంజ్ బడ్జెట్ చేయాలని అనుకుంటున్నాడట.ఎందుకంటే ఎప్పుడు హెవీ బడ్జెట్ సినిమాలు చేయడం వల్ల తను కొంచెం ఇబ్బంది పడుతున్నాడట.

ఇక మద్యలో మిడిల్ రేంజ్ సినిమాలు చేస్తే తను అనుకున్న సబ్జెక్టులని కొంతవరకు కొత్తగా చెప్పే ప్రయత్నం అయితే చేయొచ్చని తను భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.అందుకోసమే ఆయన తర్వాత సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) గానీ, నాని( Nani ) తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది అంటే ఆయన రాసుకున్న కథల్లో నాచురల్ గా నటించి మెప్పించగలరనే ఉద్దేశ్యం తోనే ఈ ఇద్దరి లో ఎవరో ఒకరితో సినిమా చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్లు గా తెలుస్తుంది.

అయితే దేవర సినిమా తర్వాత కొరటాల శివ ఎలాంటి సినిమా చేస్తాడు అనేది చూడాలి.ఇక ఎప్పుడు పెద్ద బడ్జెట్ సినిమాలు చేయడం కంటే అప్పుడప్పుడు స్మాల్ బడ్జెట్ సినిమాలను కూడా చేస్తే ప్రేక్షకుల్లో గాని, సినిమా హీరోలకి గాని ఒక మంచి చేంజ్ వచ్చినట్టుగా ఉంటుంది.అందువల్ల కొరటాల శివ ఇలాంటి ప్రయోగం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Advertisement

అందుకే ఇప్పుడు కొరటాల శివ విజయ్ దేవరకొండకు నానికి ఇద్దరికీ కథ చెప్పారట.

మరి ఇద్దరిలో ఎవరిని ఆ సినిమాలో హీరోగా తీసుకుంటాడు అనేది మాత్రం తెలియాల్సి ఉంది.ఇక వీళ్ళు మాత్రం కొరటాల డైరెక్షన్ లో నటించడానికి చాలా వరకు ఆసక్తి చూపిస్తున్నారు.అందుకే కొరటాల శివ దేవర సినిమా రిలీజ్ తర్వాతే వీరిలో ఎవరినో ఒకరిని ఫైనల్ చేసి వాళ్ళతో సినిమా చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఈ సినిమాతో కొరటాల శివ సక్సెస్ కొడుతడా లేదా అనేది చూడాలి.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు