హీరో విశ్వక్ సేన్ అసలు పేరు మీకు తెలుసా..?

వెళ్లిపోమాకే సినిమాతో విశ్వక్ సేన్ టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు.ఆ సినిమాతో నటుడిగా గుర్తింపును సొంతం చేసుకున్న విశ్వక్ ఆ సినిమా తరువాత ఈ నగరానికి ఏమైంది సినిమాలో నటించారు.

 Hero Vishwak Sen Real Name Details , Details, Paagal, Real Name, Vishwak Sen, Yo-TeluguStop.com

విశ్వక్ సేన్ నటించిన ఈ రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో ఫలితాన్ని అందుకోకపోయినా ఈ సినిమాల తరువాత నటించిన ఫలక్ నుమా దాస్, హిట్ సినిమాలు ఒకదానిని మించి మరొకటి సక్సెస్ అయ్యాయి.

హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన విశ్వక్ సేన్ అసలు పేరు దినేష్ నాయుడు.

ప్రముఖ కమెడియన్ అలీ యాంకర్ గా చేస్తున్న అలీతో సరదాగా ప్రోగ్రామ్ కు విశ్వక్ సేన్ గెస్ట్ గా హాజరయ్యారు.పేరు మార్చుకోవడానికి గల కారణం గురించి చెబుతూ నాన్న దినేష్ నాయుడు అనే పేరు పెట్టుకుంటే జీవితాంతం కష్టాలు పడతారని చెప్పారని ఆ కారణం వల్లే తాను పేరు మార్చుకున్నానని విశ్వక్ సేన్ వెల్లడించారు.

తన చిన్న వయస్సులో మొదట అలీ బ్లెస్సింగ్స్ తీసుకున్నానని బూత్ బంగ్లాలో ఏదో టెలీ ఫిల్మ్ షూటింగ్ జరుగుతుండగా తాను అలీ అశీర్వాదం తీసుకున్నానని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు.ఆ సమయంలో అలీ సినిమాల్లో అబ్బాయిని ట్రై చేయించాలని తన తండ్రికి చెప్పారని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు.ఈరోజు కారులో వస్తున్న సమయంలో అదే విషయం గుర్తుకు వచ్చిందని విశ్వక్ సేన్ పేర్కొన్నారు.

ఫలక్ నుమా దాస్ సినిమాకు సంగీతం కూడా తానే చేద్దామని అనుకున్నానని కానీ సంగీతం తనకు రాకపోవడం వల్ల వెనక్కు తగ్గానని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు.

తాను ఎప్పుడూ విజయ్ దేవరకొండ గురించి ఎప్పుడూ అనలేదని విశ్వక్ సేన్ స్పష్టతనిచ్చారు.కథ, పాత్ర నచ్చితే విలన్ రోల్ లో నటించడానికి అభ్యంతరం లేదని విశ్వక్ సేన్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube