బుడ్డ 'ఇంద్ర'డి జోరు మామూలుగా లేదుగా

మెగాస్టార్ చిరంజీవి చూడాలని ఉంది సినిమాలో అయిదేళ్ల బాలుడిగా కనిపించిన తేజ సజ్జ ఆ తర్వాత పదుల కొద్ది సినిమా ల్లో బాల నటుడిగా కనిపించి మెప్పించాడు.ముఖ్యంగా ఇంద్ర సినిమా లో చిరంజీవి చిన్నప్పటి పాత్ర చేసినందుకు గాను ఆ బుడ్డోడికి వచ్చినంత పాపులారిటీ మరే బుల్లి స్టార్ కు వచ్చి ఉండదు.

 Young Hero Teja Sajja Doing Back To Back Movies,latest News-TeluguStop.com

బుడ్డ ఇంద్ర అంటూ ఇప్పటికి అతడిని పిలుస్తున్నాం అంటే ఏ రేంజ్ లో ఆ పాత్ర సక్సెస్‌ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.ఈ బుడ్డోడు ఓ బేబీ సినిమా తో నటుడిగా కొత్త ఇన్నింగ్స్ ను మొదలు పెట్టాడు.

జాంబీ రెడ్డి తో హీరోగా మొదటి సినిమాను దక్కించుకున్నాడు.జాంబి రెడ్డి సక్సెస్‌ అవ్వడంతో ఈ బుడ్డోడు ఇక ఆగడం లేదు.

వరుసగా సినిమా లు చేసుకుంటూ వస్తున్నాడు.

జాంబిరెడ్డి ఈ ఏడాదిలోనే విడుదల అయ్యింది.ఇంతలోనే ప్రియా ప్రకాష్‌ వారియర్‌ తో కలిసి నటించిన ఇష్క్‌ సినిమా ను పూర్తి చేశాడు.కరోనా కారణంగా ఆలస్యం అవుతున్న ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇష్క కాకుండా మరో రెండు సినిమా లు కూడా తేజ సజ్జా ఓకే చేశాడు.అందులో జాంబి రెడ్డి దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమా హను మ్యాన్ కాగా మరోటి అద్బుతం.

జీవిత రాజశేఖర్‌ ల కూతురు శివాని రాజశేఖర్‌ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమా ఫస్ట్‌ లుక్ ను శివాని బర్త్‌ డే సందర్బంగా విడుదల చేశారు.

తేజ సజ్జా వరుసగా ఈ ఏడాదిలోనే నాలుగు సినిమా లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఎంట్రీ ఇచ్చిన సంవత్సరంలోనే నాలుగు సినిమా లు అంటే మామూలు విషయం కాదు.

ఆ అరుదైన ఘనత ఈ బుడ్డ ఇంద్రుడికి దక్కింది.ముందు ముందు ఈయన కెరీర్‌ ఇలాగే ఉంటుందా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube