ఆ మూవీ రిజెక్ట్ చేసి తరుణ్ తప్పు చేశారా..?

బాలనటుడిగా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించిన తరుణ్ నువ్వే కావాలి సినిమాతో హీరోగా పరిచయమై ఆ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.తొలి సినిమాతోనే లవర్ బాయ్ ఇమేజ్ ను సంపాదించుకున్న తరుణ్ కు ఆ తరువాత నటించిన కొన్ని సినిమాలు కూడా హిట్ అయ్యాయి.

 Young Hero Tarun Rejected Naresh Aha Na Pellanta Movie-TeluguStop.com

తరుణ్ స్టార్ హీరో స్థాయికి ఎదుగుతాడని అతని ఫ్యాన్స్ భావించగా వరుస ఫ్లాపుల వల్ల తరుణ్ మార్కెట్ సినిమాసినిమాకు తగ్గుతూ వస్తోంది.

అయితే ఈ హీరో కొన్నేళ్ల క్రితం ఒక హిట్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ఆ ఛాన్స్ ను వదులుకున్నారని సమాచారం.

 Young Hero Tarun Rejected Naresh Aha Na Pellanta Movie-ఆ మూవీ రిజెక్ట్ చేసి తరుణ్ తప్పు చేశారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా సీనియర్ డైరెక్టర్ వీరభద్రం చౌదరి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.అల్లరి నరేష్ హీరోగా వీరభద్రం చౌదరి డైరెక్షన్ ఆహా నా పెళ్లంట అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం గమనార్హం.

ఆ సినిమా కథను వీరభద్రం చౌదరి మొదట తరుణ్ కు చెప్పారట.అయితే తరుణ్ ఆ సినిమాలో నటించడానికి నో చెప్పడంతో అదే కథతో అల్లరి నరేష్ తో సినిమాను తెరకెక్కించానని వీరభద్రం చౌదరి అన్నారు.ఈ సినిమా కథ చెప్పే సమయానికి తరుణ్ నటించిన శశిరేఖా పరిణయం ఫ్లాప్ అయిందని వీరభద్రం చౌదరి పేర్కొన్నారు.

ఆహా నా పెళ్లంట మాత్రం పెట్టుబడికి మూడురెట్లు లాభం అందించిందని వెల్లడించారు.

ఒకవేళ తరుణ్ ఆ సినిమాలో నటించి ఉంటే తరుణ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో పాటు విజయాలు సొంతం చేసుకునే వారని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

తరుణ్ ఆ సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

#Tarun #Nuvve Kavali #Aha Na Pellanta

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు