డైరెక్టర్ పరుశురాం తో సినిమా అంటే మొహం చాటేసిన యంగ్ హీరో కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ పరుశురాం.

( Director Parasuram ) ఇక రీసెంట్ గా ఈయన విజయ్ దేవరకొండ తో చేసిన "ఫ్యామిలీ స్టార్"( Family Star ) అనే సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేదు.

ఇక దీనికంటే ముందు మహేష్ బాబుతో చేసిన "సర్కారు వారి పాట" సినిమా కూడా ఆశించిన మేరకైతే విజయం సాధించలేదు.ఇంక దాంతో ఇప్పుడు ఆయన ఒక యంగ్ స్టార్ తో ఒక సినిమా చేసి ఒక సూపర్ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక అందులో భాగంగానే "డీజే టిల్లు స్క్వేర్"( DJ Tillu Square ) తో ఒక సూపర్ సక్సెస్ ని అందుకున్న సిద్దు జనులగడ్డ తో( Siddhu Jonnalagadda ) ఆయన సినిమా చేయడానికి సన్నాహాలైతే చేస్తున్నట్టుగా ఫిలింనగర్ సర్కిల్లో ఒక న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది.ఇక ప్రస్తుతానికి సిద్దు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా తొందర్లోనే ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో పరశురాం తన సినిమా స్టోరీలో సిద్దు ను ఇన్వాల్వ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

కానీ సిద్దు జొన్నలగడ్డ కి పరుశురాం చెప్పిన స్టోరీ నచ్చకపోవడంతో స్టోరీని రిజెక్ట్ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

Advertisement

ఇక ఈ సినిమాని సిద్దు జొన్నలగడ్డ రిజెక్ట్ చేయడంతో పరుశురాం ఈ కథతో మరొక యంగ్ హీరోను లైన్ లో పెట్టే అవకాశాలైతే ఉన్నాయి.నిజానికి పరుశురాం యంగ్ హీరోలతో మంచి సక్సెస్ ను అందుకుంటాడు.కానీ స్టార్ హీరోలకి వచ్చేసరికి మాత్రం ఆయన తడబడతాడు అనే ఒక బ్యాడ్ నేమ్ అయితే ఆయన మీద మొదటి నుంచి ఉంది.

మరి ఇప్పుడు కూడా యంగ్ హీరో తో మరో సక్సెస్ సాధించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు