అప్పుడు సాయితేజ్ చేసిన సాయమే ఇప్పుడు ఈ హీరోను సేవ్ చేసిందా?

మనం ఇతరులకు మంచి చేస్తే కష్టాలు ఎదురైన సమయంలో దేవుడు మనకు మంచి చేస్తాడని పెద్దలు చెబుతుంటారు.మెగా హీరో సాయిధరమ్ తేజ్ విషయంలో ఇది నిజంగా జరిగిందనే చెప్పాలి.

 Young Hero Saidharam Tej Helping Nature Details Here, Sai Thermtej , Accident ,-TeluguStop.com

మెగా హీరోలలో ఒకరైన సాయిధరమ్ తేజ్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న యంగ్ హీరోలలో ఒకరు.సాయిధరమ్ తేజ్ గత సినిమా ప్రతిరోజూ పండగే కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.

గతంలో తేజ్ కారులో ప్రయాణించే సమయంలో టూవీలర్ పై ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి ప్రమాదానికి గురయ్యారు.ఆ సమయంలో సాయితేజ్ టాఫిక్ పోలీస్ సహాయంతో తన కారులో ఆ వ్యక్తిని తరలించడంతో పాటు చికిత్స చేయించారు.

గతంలో తేజ్ సాయం చేయగా తేజ్ ప్రమాదానికి గురైన సమయంలో మానవత్వంతో కొంతమంది స్పందించి సాయిధరమ్ తేజ్ కు సాయం చేయడం గమనార్హం.

Telugu Appolo, Bike, Nature, Megha, Sai Thermtej, Saitej, Tollywood-Movie

రెండు సంవత్సరాల క్రితం స్పృహ తప్పి పడిపోయిన ఒక భిక్షగాడిని చూసిన సాయిధరమ్ తేజ్ ఆ యాచకుడిని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య చికిత్స చేయించారు.మంచి మనస్సు ఉన్న సాయితేజ్ చలా సందర్భాల్లో ఇతరుల కష్టాలను తీర్చడానికి తన వంతు సహాయం చేశారు.మెగా హీరో అయినప్పటికీ కథల విషయంలో వైవిద్యాన్ని చూపిస్తూ సాయిధరమ్ తేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవడం గమనార్హం.

Telugu Appolo, Bike, Nature, Megha, Sai Thermtej, Saitej, Tollywood-Movie

పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, ప్రతిరోజూ పండగే, జవాన్ సినిమాలు సాయితేజ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్లుగా ఉన్నాయి.సాయితేజ్ త్వరగా కోలుకుని సినిమాలతో బిజీ కావాలని అతని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అపోలో వైద్యులు ప్రతిరోజు సాయిధరమ్ తేజ్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తున్నారు.సాయిధరమ్ తేజ్ కోలుకోవాలని కొందరు అభిమానులు ఉపవాసం చేస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube