అన్నయ్యా అని పిలిచినా లేచే పరిస్థితిలో లేను.. సాయిధరమ్ తేజ్ కామెంట్స్ వైరల్!

Young Hero Saidharam Tej Comments About Vaishnav Tej

సాయిధరమ్ తేజ్ గత సినిమా రిపబ్లిక్ థియేటర్లలో ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సాధించలేకపోయినా ఓటీటీలో మాత్రం హిట్ అనిపించుకుంది.సాయిధరమ్ తేజ్ కు వైవిధ్యం ఉన్న సినిమాలతో పోలిస్తే కమర్షియల్ సినిమాలే ఎక్కువగా విజయాలను అందిస్తుండటం గమనార్హం.

 Young Hero Saidharam Tej Comments About Vaishnav Tej-TeluguStop.com

యూత్ లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సాయిధరమ్ తేజ్ గతేడాది బైక్ యాక్సిడెంట్ ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

నిన్న సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు కాగా బర్త్ డే సందర్భంగా సాయితేజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నా ప్రియమైన వైషు బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని సాయిధరమ్ తేజ్ అన్నారు.2021 సంవత్సరంలో వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఉప్పెన సక్సెస్ సాధించడం సంతోషాన్ని కలిగించిందని సాయిధరమ్ తేజ్ కామెంట్లు చేశారు.

 Young Hero Saidharam Tej Comments About Vaishnav Tej-అన్నయ్యా అని పిలిచినా లేచే పరిస్థితిలో లేను.. సాయిధరమ్ తేజ్ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

2021 సంవత్సరం చివరిలో వైష్ణవ్ తేజ్ కుటుంబానికి అండగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని సాయిధరమ్ తేజ్ అన్నారు.

వైష్ణవ్ తేజ్ తనను ఆస్పత్రి బెడ్ మీద చూడాల్సిన పరిస్థితి రావడం బాధాకరం అని సాయిధరమ్ తేజ్ కామెంట్లు చేశారు.ఆస్పత్రిలో బెడ్ పై ఉన్న సమయంలో వైష్ణవ్ తేజ్ అన్నయ్యా అని ప్రేమగా పిలిచినా తాను లేచే పరిస్థితిలో లేనని సాయితేజ్ చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో కూడా వైష్ణవ్ తేజ్ బాధను దిగమింగుకుంటూ నిలబడ్డాడని సాయితేజ్ అన్నారు.ఆస్పత్రి నుంచి కోలుకుని ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత తాను వైష్ణవ్ తేజ్ కళ్లలో సంతోషాన్ని చూశానని సాయితేజ్ వెల్లడించారు.తమ్ముడిగా వైష్ణవ్ తేజ్ ను చూసి గర్వపడతానని సాయితేజ్ చేసిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

వైష్ణవ్ తేజ్ వరుసగా సినిమా ఆఫర్లతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ హీరో మూడో సినిమాకు రంగ రంగ వైభవంగ అనే టైటిల్ ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

#@republic #Sai Dharam Tej #Saidharam Tej #Vaishnav Tej #Vaishnav Tej

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube