స్టార్ డైరెక్టర్ కు విలన్ గా మారిన యంగ్ హీరో

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా రాణించిన వి.వి.

 Young Hero Playing Avillain Role In Vinayak Seenayya Movie-TeluguStop.com

వినాయక్ ప్రస్తుతం హీరో గా తెరంగ్రేటం చేసే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో వి.వి.వినాయక్ హీరోగా నరసింహారావు అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో ‘సీనయ్య ‘ పేరుతో ఒక చిత్రం తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయి విశేష స్పందన కూడా లభించింది.ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

Telugu Andalarakshashi, Aravindasametha, Youngvillain-

అదేమిటంటే ఈ చిత్రంలో విలన్ గా ఒక యంగ్ హీరో కనిపించనున్నట్లు సమాచారం.‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.అయితే చిత్ర బృందం నుంచి సరైన అప్ డేట్ రానప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఇంతకుముందు నవీన్ ‘నేను లోకల్’ వంటి పలు చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాలో నవీన్ వినాయక్‌తో పోటీ పడి మరీ తన విలనిజంను చూపించనున్నాడట.మరి ఈ న్యూస్ పై ఒక క్లారిటీ కావాలి అంటే మాత్రం కొద్దీ రోజులు ఆగాల్సిందే.

డైరెక్టర్ గా ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వినాయక్ ఇప్పుడు హీరో గా ఏ మేరకు రాణిస్తారో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube