రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జాతి రత్నం..ఇక మాములుగా ఉండదు!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సినిమా రాధేశ్యామ్.రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

 Young Hero Naveen Polishetty To Host Radhe Shyam Pre-release Event, Naveen Polis-TeluguStop.com

ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.విడుదల తేదీ కూడా దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు చిత్ర యూనిట్.

ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పాటలు, పోస్టర్స్, టీజర్ వంటివి వదిలారు.వీటితో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 23న జరగనుంది.హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ ఈవెంట్ ను ఎంతో గ్రాండ్ గా నిర్వహించనున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రోగ్రాం హోస్ట్ గా జాతి రత్నం రాబోతున్నాడట.

Telugu Pooja Hegde, Prabhas, Radhe Shyam, Radhe Shyam Pre, Youngnaveen-Movie

జాతి రత్నాలు సినిమాతో మంచి విజయం అందుకోవడమే కాకుండా బాగా పాపులర్ అయ్యాడు నవీన్ పోలిశెట్టి.ఈ సినిమా హిట్ తో వరుస ఆఫర్లను అందుకుని దూసుకు పోతున్నాడు.జాతి రత్నాలు సినిమా ప్రమోషన్స్ సమయంలో ప్రభాస్, నవీన్ కలిసి చాలా ఎంటర్టైన్ చేసారు.

ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో ప్రభాస్ తో ఏర్పడిన అనుబంధం అలాగే కొనసాగుతుంది.

Telugu Pooja Hegde, Prabhas, Radhe Shyam, Radhe Shyam Pre, Youngnaveen-Movie

దీంతో ఇప్పుడు రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హోస్ట్ గా చేసే అవకాశం అందుకున్నాడు.ఇక ఈ ఈవెంట్ లో ప్రభాస్, నవీన్ అల్లరి ఎంత ఉంటుందో చూడాలి.రేపు జరగబోతున్న ఈ ఈవెంట్ కు ఇప్పటికే ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయని తెలుస్తుంది.

ఇక ఈ వేడుకకు ప్రభాస్ తదుపరి చేస్తున్న సినిమాల దర్శకులందరు రాబోతున్నారట.మరి ఈ ఈవెంట్ ఎంత గ్రాండ్ గా జరగనుందో చూడడం కోసం అభిమానులంతా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube