అలాంటి విషయాల్లో ఆమె సలహా తీసుకుంటాను : నాగచైతన్య

జోష్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్యకు తొలి సినిమాతో చేదు అనుభవం మిగిలింది.జోష్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

 Young Hero Nagachaitanya Seeks Help From Heroine Samantha-TeluguStop.com

తొలి సినిమాతో నాగచైతన్య అభిమానులను నిరాశపరిచినా ఏమాయ చేశావె, 100% లవ్ సినిమాలతో సక్సెస్ సాధించారు.ఆ తరువాత నాగచైతన్య హీరోగా నటించిన క్లాస్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎక్కువగా బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి.

నాగచైతన్య గత సినిమాలు మజిలీ, వెంకీమామ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకున్నాయి.త్వరలో నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా రిలీజ్ కానుండగా థ్యాంక్యూ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

 Young Hero Nagachaitanya Seeks Help From Heroine Samantha-అలాంటి విషయాల్లో ఆమె సలహా తీసుకుంటాను : నాగచైతన్య-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా కూడా ఈ ఏడాదే రిలీజ్ కానుంది.తాజాగా లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్స్ లో భాగంలో నెంబర్ 1 యారి ప్రోగ్రామ్ కు హాజరైన నాగచైతన్యను రానా సోషల్ మీడియాకు సంబంధించి సందేహాలు ఉంటే ఎవరిని సంప్రదిస్తావ్ అని ప్రశ్నించాడు.

ఆ ప్రశ్నకు చైతన్య తనకు సోషల్ మీడియాకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా సమంత సలహాలు తీసుకుంటానని తెలిపారు.రానా శేఖర్ కమ్ముల డ్రెస్ గురించి మాట్లాడుతూ లీడర్ సినిమా షూటింగ్ సమయంలో ఎలాంటి డ్రెస్ వేసుకున్నారో ఇప్పుడు కూడా అలాంటి డ్రెస్ వేసుకున్నారని అన్నారు.

శేఖర్ కమ్ముల రానా అలా అనడంతో ఆ డ్రెస్ ఈ డ్రెస్ ఒకటి కాదని ఈ డ్రెస్ కూడా ఆ డ్రస్ స్టైల్ లోనే ఉంటుందని అన్నారు.

నాగచైతన్య ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించినా ఒక్క సినిమా కూడా 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించలేదు.లవ్ స్టోరీ సినిమాతో 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను నాగచైతన్య సాధిస్తారని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు.లవ్ స్టోరీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని 50 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

#Saipallavi #Number1 #Shekhar Kamal #Nagachaitanya #Sekhar Kammula

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు