నాగచైతన్య దగ్గర ఖరీదైన బైకులు, కార్లు.. వాటి ఖరీదెంతంటే..?

యంగ్ హీరో నాగచైతన్యకు కార్లు, బైకులు అంటే చాలా ఇష్టం అనే సంగతి తెలిసిందే.మార్కెట్ లోకి ఏదైనా బైక్ లేదా కారు వచ్చిందంటే చైతన్య ఆ కారు లేదా బైక్ ను కొనుగోలు చేయడానికి తెగ ఆసక్తి చూపుతారు.

 Young Hero Nagachaitanya Expensive Cars And Bikes Collection Details-TeluguStop.com

కార్లు, బైకుల కలెక్షన్ చైతన్య దగ్గర బాగానే ఉండటం గమనార్హం.చైతన్య కార్లు, బైకుల కొరకు భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం గమనార్హం.

నాగచైతన్య దగ్గర ఉన్న ఖరీదైన బైక్ లలో “bmwr9t” ఒకటి కాగా నాగచైతన్య ఈ బైక్ కోసం ఏకంగా 19 లక్షల రూపాయలు ఖర్చు చేయడం గమనార్హం.సమంతతో కలిసి నాగచైతన్య ఈ బైక్ పై చక్కర్లు కొట్టగా ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

 Young Hero Nagachaitanya Expensive Cars And Bikes Collection Details-నాగచైతన్య దగ్గర ఖరీదైన బైకులు, కార్లు.. వాటి ఖరీదెంతంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నాగచైతన్య దగ్గర ఈ బైక్ తో పాటు దాదాపు 13 లక్షల రూపాయల విలువ చేసే “triumph thruxton r bike” కూడా ఉంది.చైతన్యకు ఇష్టమైన బైక్ లలో ఈ బైక్ కూడా ఒకటి కావడం గమనార్హం.

నాగచైతన్య దగ్గర ఫెర్రారి ఎఫ్ 430 మోడల్ కారు ఉంది.సెలబ్రిటీలు ఈ కారును ఎంతగానో ఇష్టపడతారు.చైతన్య దగ్గర ఉన్న ఈ కారు ధర ఏకంగా కోటీ 75 లక్షల రూపాయలు కావడం గమనార్హం.

ఈ కార్లతో పాటు చైతన్య దగ్గర మెర్సిడస్ బెంజ్ జీ క్లాస్ జీ663 కారు కూడా ఉంది.దాదాపు కోటి రూపాయల ఖరీదు చేసే ఈ కారు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీల దగ్గర కూడా ఉంది.

నాగచైతన్య ఫేవరెట్ కారు విషయానికి వస్తే ఎంవీ అగస్ట ఎఫ్4 కు ప్రత్యేక స్థానం ఉంది.ఈ కారు ధర 35 లక్షల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం.ఈ కార్లు, బైకులతో పాటు మరికొన్ని బైకులు, కార్లు చైతన్య ఉన్నాయి.

మరోవైపు సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది చైతన్య నటించిన రెండు సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లో రిలీజ్ కానున్నాయని సమాచారం.విక్రమ్ కె కుమార్ ఆగష్టు నెల మొదటి వారం నాటికి థ్యాంక్యూ సినిమా షూటింగ్ పూర్తవుతుందని వెల్లడించారు.

#NagaChaitanya #NagaChaitanya #Thankyou #Nagachaitanya #BikesCollection

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు