పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యంగ్‌ హీరో

చందమామ కథలు అనే సినిమా తో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నాగ శౌర్య ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ఆ సినిమా సక్సెస్ అవ్వడం తో నాగశౌర్య కెరియర్లో మంచి సినిమాలు చేసే అవకాశాలను దక్కించుకున్నాడు.

 Young Hero Naga Shaurya Marriage News , Naga Shaurya, Marriage , Tollywood, Krishna Vrinda Vihari, Lakshya-TeluguStop.com

అయితే అందులో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి.కొన్ని సినిమాలు మాత్రం మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.

సక్సెస్ ఫ్లాప్ లను పట్టించుకోకుండా వరుసగా సినిమాలను చేస్తున్న నాగ శౌర్య కృష్ణ వ్రింద విహారి అనే సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

 Young Hero Naga Shaurya Marriage News , Naga Shaurya, Marriage , Tollywood, Krishna Vrinda Vihari, Lakshya-పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యంగ్‌ హీరో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ ఈ సంవత్సరం తన పెళ్లి ఉంటుంది అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

తెలుగు అమ్మాయా లేదంటే ఉత్తరాది అమ్మాయా అంటూ మీడియా వారు ప్రశ్నించగా అమ్మాయి తెలుగు మాట్లాడుతుంది అన్నట్లుగా హింట్ ఇచ్చాడు.

లవ్ మ్యారేజ్ అని కూడా అతడి మాటలను బట్టి అర్థమవుతుంది.తల్లి నిర్మాత అవడం వల్ల ఇన్ని సినిమాలు చేశాడంటూ కొందరు విమర్శలు చేస్తున్నా తనకంటూ విభిన్నమైన స్టైల్ క్రియేట్ చేసుకుని మంచి ప్రతిభ ఉన్న నటుడిగా దూసుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న నాగశౌర్య అప్పుడే పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు.

Telugu Krishnavrinda, Lakshya, Naga Shurya, Tollywood-Movie

నాగశౌర్య కంటే చాలా సంవత్సరాలు పెద్ద అయిన వారు కూడా ఇంకా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నారు, అప్పుడే నాగశౌర్య కి తొందరగా వచ్చిందా.కెరియర్ లో ఇంకా మూడు నాలుగు సక్సెస్ లు పడ్డ తర్వాత పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ కొందరు సలహా ఇస్తున్నారు.అయితే ఇంట్లో వారి తొందరనో లేదంటే మరేంటో కానీ నాగశౌర్య ఈ సంవత్సరం పెళ్లి చేసుకున్నట్లుగా కనిపిస్తున్నాడు.ఈ సంవత్సరం కాకున్నా వచ్చే సంవత్సరమైనా అతడి పెళ్లి పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube