'రుద్రాక్షపురం' చిత్రంతో నా స్థాయి పెరుగుతుంది.. యువ హీరో మణి సాయితేజ

Young Hero Mai Sai Teja Comments On Rudrakshapuram Movie

‘రుద్రాక్షపురం’ చిత్రంతో నా స్థాయి పెరుగుతుంది అన్నారు యువకెరటం హీరో మణి సాయితేజ. మాక్‌వుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో నిర్మాత కొండ్రసి ఉపేందర్ నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం’.ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరిదశలో ఉంది.ఈ చిత్రంలో మెయిన్ హీరోగా నటిస్తున్న తనకు చాలా మంచి పాత్ర లభించిందని, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే పాత్ర చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని మణి సాయితేజ తెలిపారు.

 Young Hero Mai Sai Teja Comments On Rudrakshapuram Movie-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.‘‘ముందుగా అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.

ఆర్.కె.గాంధీ గారి దర్శకత్వంలో ప్రస్తుతం నేను చేస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం’.ఇంతకుముందు ‘బ్యాట్ లవర్స్’ మూవీలో హీరోగా చేశాను.

 Young Hero Mai Sai Teja Comments On Rudrakshapuram Movie-రుద్రాక్షపురం’ చిత్రంతో నా స్థాయి పెరుగుతుంది.. యువ హీరో మణి సాయితేజ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చిత్రంతో అందరికీ పరిచయమైన నేను.ఇప్పుడు చేస్తున్న ‘రుద్రాక్షపురం’ చిత్రంలో ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నాను.

ఈ పాత్రకి నన్ను సెలక్ట్ చేసినందుకు దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.ఈ పాత్ర నా స్థాయిని పెంచే చిత్రమే కాకుండా.నా జీవితంలో ఎప్పటికీ నిలిచిపోయే పాత్రగా ఉంటుంది.

Telugu Role, Rk Gandhi, Mani Sai Teja, Mai Sai Teja, Upender, Rudrakshapuram, Tollywood, Young-Movie

ఈ సినిమా విడుదల తర్వాత నా పాత్రకే కాదు.ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వస్తుంది.ఒక యధార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

నా పాత్రను దర్శకుడు చాలా వైవిధ్యంగా తీర్చిదిద్దారు.ఈ సినిమా తర్వాత ‘మరోచైత్రం’ అనే చిత్రంలో హీరోగా నటించబోతున్నాను.

ఈ మూవీ ఫిబ్రవరిలో ప్రారంభం అవుతుంది.అందులో కూడా నాది ఛాలెంజింగ్ రోల్.

ఈ పాత్రలతో హీరోగా నాకు మంచి పేరు వస్తుందని ఎంతగానో నమ్ముతున్నాను.దర్శకుడు ఆర్.కె.గాంధీగారికి, నిర్మాత ఉపేందర్ గారికి ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.థ్యాంక్యూ.’’ అని తెలిపారు.

#Rudrakshapuram #Gandhi #Young #Sai Teja #Upender

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube