రాజావారు రాణి గారు సినిమాతో ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం ఈమధ్యనే ఎస్.ఆర్ కళ్యాణమండపం సినిమాతో కూడా ఇంప్రెస్ చేశాడు.
కేవలం హీరోగానే కాదు రైటర్ గా కూడా కిరణ్ తన టాలెంట్ చూపిస్తున్నాడు.రాజావారు రాణిగారు సినిమాతో మెప్పించిన కిరణ్ అబ్బవరం సెకండ్ సినిమా ఎస్.
ఆర్ కళ్యాణమండపం సినిమాతో కూడా హిట్ కొట్టాడు.ఇక రెండు సినిమాలు ఆడాయో లేదో రైటర్ కం హీరో తన రెమ్యునరేషన్ పెంచేసినట్టు తెలుస్తుంది.
ఎస్.ఆర్ కళ్యాణమండపం చూసి ఓ నిర్మాత కిరణ్ తో సినిమా అనుకున్నారట.
అయితే ఆ నిర్మాతకు రెమ్యునరేషన్ తో షాక్ ఇచ్చాడట కిరణ్ అబ్బవరం.మొదటి రెండు సినిమాలకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో కాని తన దగ్గరకు వచ్చిన ప్రొడ్యూసర్ కు రెండున్నర కోట్ల రెమ్యునరేషన్ అడిగి షాక్ ఇచ్చాడట కిరణ్.
మరి యువ హీరో అంతగా డిమాండ్ చేయడానికి కారణం ఏంటన్నది తెలియదు కాని కిరణ్ అబ్బవరం అడిగిన రెమ్యునరేషన్ కు ఆ నిర్మాత భయపడ్డాడని తెలుస్తుంది.రెండు సినిమాల తర్వాత కోటికి అటు ఇటుగా డిమాండ్ చేస్తే ఓకే కాని ఏకంగా 2.5 కోట్లు అంటే కొద్దిగా ఎక్కువనే చెప్పాలి. అయితే కిరణ్ అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి అతన్ని హీరోగా పెట్టి సినిమా చేస్తారా లేదా అన్నది చూడాలి.