నా కేరాఫ్ అడ్రస్ మా నాన్నే అంటున్న హీరో!  

టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ మోస్ట్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు.టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి వారి సినీ జీవితంలో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అందించాడు.

TeluguStop.com - Young Hero Akash Puri Visits Arasavalli Suryanarayana Temple

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన పోకిరి, బద్రి, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఇంతటి భారీ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు,తన కుమారుడు ఆకాశ్ ను బాల నటుడిగా పలు సినిమాలలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు.

బాలనటుడిగా ఆకాష్ ఎంతో అద్భుతంగా నటించి, తరువాత హీరోగా ఆరంగ్రేటం చేశారు.ఇప్పటికే ఆకాష్ ఆంధ్ర పోరి, మెహబూబా వంటి చిత్రాలలో నటించారు.అయితే ఆకాష్ హీరోగా మరొక రొమాంటిక్ చిత్రంలో నటించారు.అయితే ఈ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

TeluguStop.com - నా కేరాఫ్ అడ్రస్ మా నాన్నే అంటున్న హీరో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం తన దృష్టి అంతా లవ్ అండ్ యాక్షన్ సినిమాలపైనే ఉందని అన్నారు.మాస్ తరహా మూవీలను తీయడానికి ప్రిపేర్ అవుతున్నానని ఆదిత్యుని ఆలయ దర్శనానికి వచ్చిన ఆకాష్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

నా కేరాఫ్ అడ్రస్ నాన్నే… అంటూ, బాల నటుడిగా నన్ను తెరపై చూపించిన నాన్న ఇప్పుడు నన్ను హీరోగా చేశారని , అందుకు తగిన శిక్షను నాన్న దగ్గర తీసుకున్నానని ఆకాష్ తెలిపారు.ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి ఆదిత్య ఆలయాన్ని దర్శించుకున్నారు.ఈ సందర్భంలోనే ఆకాష్ మీడియాతో కాసేపు ముచ్చటించారు.సినిమాలలో నటించాలని ఎంతో ఆసక్తి ఉందని, నాన్న ప్రేరణతోనే, తన అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు.మొదటిసారిగా ఆదిత్య ఆలయాన్ని దర్శించుకునందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.దర్శనం అనంతరం ఆకాష్ కు ఆలయ ఈఓ వి.హరిసూర్యప్రకాష్‌ ఆదిత్యుని చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు.

#Akash Puri #Aakash Puri #RomanticMovie #Puri Jagannadh #AakashPuri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు