రాహుల్ ని చూసినా సంతోషంలో వెక్కివెక్కి ఏడ్చిన యువతి... వీడియో వైరల్....

కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ 22 రోజుల క్రితం జూడో యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.ఈ జూడో యాత్రలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో రాహుల్ గాంధీ కేరళలో పర్యటిస్తూ ఉన్నారు.

 Young Girl Who Cried In Happiness After Seeing Rahul Video Viral ,kerala, Rahul-TeluguStop.com

ఆయన పాదయాత్ర కేరళలోని పండిక్కాడ్‌ స్కూల్‌ పాడి నుంచి ప్రారంభమైంది.ఉదయం 10.30 గంటలకు వండూరు జంక్షన్‌లో విరామం కోసం ఆగారు.సరిగ్గా ఆ పాదయాత్ర లో ఒక యువతి రాహుల్‌ గాంధీ ని కలిసిన ఆనందంతో చిన్నపిల్లలాగా ఏడ్చేసింది.

ఆమె కు రాహుల్‌ని కలిశానన్నా అవధులు లేని ఆనందం తో పాటు ఏడుపు కూడా వచ్చేసింది.ఆమె రాహుల్‌ని చూసి భావోద్వేగంతో ఏడుపుని ఆపుకోలేకపోయింది.ఆ యాత్రలో పాల్గొన్న వాళ్లంతా ఆ యవతి చర్యలను చూసి ఆశ్చర్యంతో నవ్వుతుండగా,రాహుల్‌ ఆ యువతని ఎగ్జాయిట్‌మెంట్‌ని కంట్రోల్‌ చేస్తూ,దగ్గరకు తీసుకుని ఓదార్చారు.వాస్తవానికి ఇలా పాప్‌ సింగర్స్‌ లేదా హిరో,హిరోయిన్‌లు వచ్చినప్పుడూ అభిమానులు ఇలా చేస్తూ ఉంటారు.

కానీ అలాంటి సన్నివేశం రాహుల్‌ గాంధీకి ఈ పాదయాత్ర లో ఎదురవ్వడం విశేషం.ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.ఇదిలా ఉండగా ఆయన కేరళ పాదయాత్ర ​ఈ రోజు సాయంత్రానికల్లా వాయనాడ్‌ నియోజకవర్గం లోకి ఎంట్రీ అవుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శ, కమ్యూనికేషన్స్‌ ఇన్‌చార్జ్‌ జైరాం రమేష్‌ తెలిపారు.150 రోజుల పాదయాత్ర దాదాపు 3,750 కిలోమీటర్లు ఉంటుంది.

ఈ పాదయాత్ర తమిళనాడు లోని కన్యాకుమారి నుంచి ప్రారంభమై జమ్ము కాశ్మీర్‌లో ముగుస్తుంది.అలాగే సెప్టంబర్‌ 10కి కేరళలో ప్రవేశించిన కాంగ్రెస్‌ జోడో పాదయాత్ర 450 కి.మీ దూరం సాగుతూ సుమారు ఏడు రాష్ట్రాలను దాటుకొని అక్టోబర్‌ 1 నాటికి కర్ణాటకలోకి ఎంట్రీ ఇవ్వనుందని జై రాం రమేష్‌ తెలిపారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube