ప్రేమించిన ప్రియుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని ప్రేయసి ఏకంగా…   

Young Girl Attack With Knife On Her Boyfriend - Telugu Crime News, Krishna District, Love Failure, Suicide

ప్రస్తుత కాలంలో కొందరు ప్రేమ పేరుతో తమ కామ వాంఛలు తీర్చుకుని ఆడపిల్లలను మోసం చేయాలని భావిస్తూ వారి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు.తాజాగా ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసేటువంటి ఓ యువతి స్థానికంగా ఉన్నటువంటి యువకుడిని ప్రేమించి సర్వం అర్పించగా చివరికి ఆమె ప్రియుడు పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో అతడిపై యువతి దారుణంగా కత్తితో దాడి చేసిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది.

 Young Girl Attack With Knife On Her Boyfriend

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకు చెందినటువంటి నాగలక్ష్మి అనే యువతి ఓ ప్రైవేటు కాలేజీ లో  లెక్చరర్ గా పని చేస్తోంది.ఈ క్రమంలో లో స్థానిక ఉన్నటువంటి పవన్ కుమార్ అనే కంప్యూటర్ ఆపరేటర్ తో ప్రేమలో పడింది.

దీంతో వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగే వాళ్ళు.

ప్రేమించిన ప్రియుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని ప్రేయసి ఏకంగా… -Latest News-Telugu Tollywood Photo Image

అంతేకాక ప్రేమ మైకంలో ఇప్పటికే పలు హద్దులను కూడా దాటారు.

దీంతో నాగలక్ష్మి పలుమార్లు పవన్ కుమార్ ని పెళ్లి చేసుకోవాలని అడిగింది.అయితే ఎప్పుడు నాగలక్ష్మి పెళ్లి మాట అడిగినప్పటికీ పవన్ దాటవేస్తూ వచ్చాడు.

దీంతో మోసపోయానని గ్రహించినటువంటి నాగలక్ష్మి ఎలాగైనా అతడిపై కక్ష సాధించాలని పన్నాగం పన్నింది.

ఈ క్రమంలో మాట్లాడాలని పవన్ కుమార్ ని తాను నివాసం ఉంటున్నటువంటి ప్రదేశానికి పిలిపించింది.

అయితే ముందుగా తాను అనుకున్న విధంగానే పవన్ కుమార్ రాగానే కత్తితో అతనిపై బలంగా దాడి చేసింది.అనంతరం నాగలక్ష్మి కూడా నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది.

ఇది గమనించినటువంటి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి బాధితులను చికిత్సను నిమిత్తమై దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు.స్థానికుల నుంచి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test