14 సింహాల‌కు చుక్క‌లు చూపించిన ఏనుగు..

అడ‌విలో వేట అంటే మామూలుగా ఉండ‌దు.ఏ క్ష‌ణంలో ప్ర‌మాదం ఏ జంతువు రూపంలో వ‌స్తుందో చెప్ప‌డం ఎవ‌రిత‌రం కాదు.

 Young Elephant Takes On 14 Lions And Survives Viral Video, 14lions Vs Elephant,-TeluguStop.com

అప్ప‌టి వ‌ర‌కు నిశ్వ‌బ్దంగా ఉన్న ప్రాంతం ఒక్క‌సారిగా మార‌ణ హోమాన్ని త‌ల‌పిస్తుంది.ప‌చ్చ‌గా ఉన్న గ‌డ్డి కూడా ర‌క్తంతో ఎర్ర బ‌డుతుంది.

నిత్యం ప్రాణాలు తీసే వేట‌కు అడ‌విపెట్టింది పేరు.ఒక జీవికి ఆక‌లి వేసిందా ఇంకో జీవికి ఆయువు మూడిందా అనే పాట మ‌న‌కు పుష్ప మూవీలో వ‌చ్చింది క‌దూ.

ఈ పాట నిజంగా కొన్ని వీడియోల‌కు బాగా వ‌ర్తిస్తుంది.అవును మ‌రి అడ‌విలో ఒక జీవికి ఆక‌లి వేసిందంటే.

మ‌రో జీవి ప్రాణాలు విడ‌వాల్సిందే.

అయితే వేట అన‌గానే ఎప్పుడూ వేటాడే జంతువే గెలుస్తుంది అనుకుంటే పొర‌పాటే.

కొన్ని సార్లు వేట కూడా తిర‌గ‌బ‌డుతుంది.త‌న బ‌లం కంటే అవ‌త‌లి జంతువు బ‌లంగా ఉంటే ఆ వేటాడే జంత‌వు అడ‌వికి రాజు అయినా స‌రే ఓడిపోవాల్సిందే.

ఇలా ఓడిపోయిన ఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి.ముఖ్యంగా సింహాలు వేటాడే స‌మ‌యంలో ఏనుగులు, అడ‌వి దున్న‌ల విష‌యంలో చాలా సార్లు ఓడిపోతుంటాయి.

ఎందుకంటే అవి సింహాల కంటే చాలా బ‌లంగా ఉంటాయి.అయితే ఇప్పుడు కూడా ఓ ఏనుగు ఇలాగే త‌న ప్ర‌తాపం ఏంటో చూపించింది.

ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 14 సింహాల‌కు చుక్క‌లు చూపించింది.అవ‌న్నీ క‌లిసి ఒక్క ఏనుగును ఓడించ‌లేక‌పోయాయి.ఈ వైర‌ల్ వీడియోలో ఓ వాగు ప‌క్క‌న ఏనుగును 14 సింహాలు క‌లిసి మ‌ట్టు పెట్టాల‌ని అనుకుంటాయి.కానీ అనూహ్యంగా ఆ ఏనుగు అన్నింటికీ చుక్క‌లు చూపిస్తుంది.

అవి ఎంత ప్ర‌య‌త్నించినా దాన్ని లొంగ‌దీసుకోలేక‌పోతాయి.వాట్నింటినీ త‌న వేగం, బ‌లంతో తిప్పికొట్టేస్తుంది.

ఇలా చాలా సేపు వాటిని ముప్పుతిప్ప‌లు పెడుతుంది.చివ‌ర‌కు అవి చేసేది లేక దాని నుంచి కాస్త దూరంగా వ‌స్తాయి.

దీంతో ఆ ఏనుగు ఆ వాగు దాటి వెళ్లిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube