అమెరికాలో విషాదం: మళ్లీ గర్జించిన తుపాకీ.. కాల్పుల్లో ప్రముఖ ర్యాపర్‌ యంగ్ డాల్ఫ్ కన్నుమూత

అగ్రరాజ్యం అమెరికాలో నానాటికీ పెరుగుతున్న గన్ కల్చర్‌‌కు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.నగదు, నగలు కోసం హత్యలు చేసేవారు కొందరైతే.

 Young Dolph, Promising Memphis Rapper, Shot And Killed At 36 , Memphis, Tennesse-TeluguStop.com

జాతి, వర్ణ వివక్షలతో ఉన్మాదులుగా మారేవారు మరికొందరు.ఏది ఏమైనా అక్కడ గన్ కల్చర్ వల్ల ఏటా వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.

దీనికి చెక్ పెట్టాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నా.శక్తివంతమైన గన్ లాబీ ఈ ప్రయత్నాలను అడ్డుకుంటోందన్న వాదనలు వున్నాయి.

ఇక తుపాకీ కాల్పుల్లో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు.

తాజాగా అక్కడ మరోసారి కాల్పులు కలకలం రేపాయి.

టెన్నెస్సీలోని మెంఫిస్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్న ఓ కుకీ షాప్‌లో ప్రముఖ ర్యాపర్ యంగ్ డాల్ఫ్‌పై దుండగులు కాల్పులు జరిపారు.ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

 మెంఫిస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కథనం ప్రకారం 2370 ఎయిర్‌వేస్ బౌల్‌వార్డ్ వద్ద కాల్పులు చోటు చేసుకున్నాయి.ఘటన జరిగిన ప్రదేశంలో హోమ్‌మేడ్ బటర్ కుకీలకు బాగా ప్రసిద్ధి.

అందుకే యంగ్ డాల్ఫ్ ఇక్కడికి తరచుగా వస్తూ వుంటారు.కాల్పుల తర్వాత ఘటనా స్థలిలో ఒక పురుషుడు మరణించినట్లు పోలీసులు తెలిపారు.

అతని వివరాలు ఆరా తీయగా ఆయన ప్రముఖ ర్యాపర్ యంగ్ డాల్ఫ్‌గా గుర్తించారు.అతని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోల ప్రకారం యంగ్ డాల్ఫ్‌దిగా చెప్పుకుంటున్న లంబోర్ఘిని కారు .స్టోర్ ముందు పార్క్ చేసి వుండటం కూడా పోలీసుల అనుమానాలకు బలం చేకూర్చింది.

Telugu Adolfrobert, Homemadebutter, Memphis, Lamborghini, Memphis Rapper, Rich S

36 ఏళ్ల యంగ్‌ డాల్ఫ్‌ చికాగోలో పుట్టారు.ఆయన అసలు పేరు అడాల్ఫ్‌ రాబర్ట్ థోర్నటన్‌.2008 నుంచి అమెరికన్ పాప్ వరల్డ్‌లో ర్యాపర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.గతేడాది ఆయన రూపొందించిన రిచ్‌ స్లేవ్‌ ఆల్బమ్‌కు బిల్‌బోర్డ్‌ టాప్‌ 200 లిస్ట్‌లో స్థానం లభించింది.పేపర్ రూట్ కాంపేన్, కింగ్ ఆఫ్ మెంఫిస్, రిచ్ స్లేవ్, తదితర ఆల్బమ్స్‌కు సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన వచ్చింది.

కాగా.యంగ్ డాల్ఫ్ ఇటీవలి కాలంలో మానసికంగా కృంగిపోయినట్లుగా తెలుస్తోంది.

గత నెలలో ట్విట్టర్‌లో చేసిన పోస్టులలో తన మెంటల్ హెల్త్ గురించి పోస్ట్ చేశాడు.ఇలాంటి పరిస్ధితుల్లో కాల్పుల ఘటనలో యంగ్ డాల్ఫ్ ప్రాణాలు కోల్పోవడంతో పాప్ ప్రపంచం, సినీ ప్రియులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube