పెళ్ళి వేడుకలలో అగ్నిసాక్షిని అపహాసం చేసిన యువ జంట..!

సహజంగా వివాహ వేడుకలు అంటే భారతీయ సాంప్రదాయం ప్రకారం.వేదమంత్రాలు, బాజాభజంత్రీలు, స్నేహితులు, బంధువులు ఇలా అనేక విషయాలు ఉంటాయి.

 Young Couple Mocks Fire Witness At Wedding Ceremony-TeluguStop.com

అంతేకాకుండా పెళ్లి వేడుకలు కూడా ఒక రేంజ్ లో హడావిడి చేస్తూ ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు.వధువరులు ఇద్దరు కూడా ఎంతో నిష్ట నియమాలు పాటిస్తూ… వివాహ వేడుకలలో పాల్గొంటూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం.

కానీ మారే కాలంతోపాటు సాంప్రదాయాలలో కూడా కాస్త మార్పులు జరిగాయి.

 Young Couple Mocks Fire Witness At Wedding Ceremony-పెళ్ళి వేడుకలలో అగ్నిసాక్షిని అపహాసం చేసిన యువ జంట..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పెళ్లికి ముందే ఫ్రీ వెడ్డింగ్ షూటింగ్ అంటూ ఇలా పలు రకాల మార్పులు ప్రవేశపెట్టారు ప్రస్తుత యూత్ .అందుకు తగ్గట్టుగానే పెద్దలు కూడా ఇంతకు ముందు లాగా పట్టించుకోవడం లేదు.అలాగే పెళ్లి అవ్వక ముందర కాబోయే వధువు, వరులు వింత వింత ఫోటోలు, వీడియోలతో వార్తలలో నిలుస్తున్న సంగతి అందరం చూస్తూనే ఉన్నాం.

ఇది ఇలా ఉండగా తాజాగా ఒక పెళ్లి వేడుకల సమయంలో ఒక జంట చేసిన వింత చేష్టలు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.

పెళ్లి మండపంలో ఆ కొత్త జంట చాలా పవిత్రంగా భావించే అగ్నిహోత్రం చుటూ ఏడు సార్లు ప్రదక్షణ చేసే సమయంలో వధూవరులిద్దరూ డాన్స్ చేయడం, పెళ్లి ప్రయాణాలు అపహాస్యం చేయడం, వధూవరులకు ఆహుతులు వారించడం మానేసి చప్పట్లు కొడుతూ ఉత్సాహ పరచడం చాలా విచిత్రంగా ఉంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ చక్కర్లు కొడుతుంది.ఈ వీడియోను వీక్షించిన కొంతమంది నెటిజన్స్ వారి స్టైల్ లో స్పందిస్తూ పెళ్లిని అపహాస్యం చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఏది ఏమైనా సరే ఇలా సాంప్రదాయ పద్ధతులను అపహాస్యం చేయడం అందరినీ ఆగ్రహానికి గురి చేస్తుంది.ఇంకెందుకుఆలస్యం మీరు కూడా ఆవీడియోను చూసేయండి.

#Groom #Dance #Viral Video #Bride

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు