యాపిల్ కంపెనీపై కుర్రాడి పరువునష్టం దావా! అసలు కారణం ఇదే.

అమెరికాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజ సంస్థ యాపిల్‌పై ఓ కుర్రాడు పరువునష్టం దావా వేశాడు.తనని దొంగగా చిత్రీకరించి, తన వివరాలను యాపిల్‌ స్టోర్లలో ఉంచినందుకు 7000 కోట్లు పరిహారంగా చెల్లించాలంటూ న్యాయస్థానంని ఆశ్రయించాడు.

 Young Boy Defamation Case On Apple Company-TeluguStop.com

వివరాల్లోకి వెళ్తే 18 సంవత్సరాల వయసు గల ఔస్మేన్ బా తన యాపిల్‌ ఫోన్‌లో ఫేస్‌ డిటెక్షన్‌ ద్వారా ఫోన్‌ లాక్‌ తెరుచుకునేలా సెట్టింగ్స్ చేసుకున్నాడు.తరువాత యాపిల్ స్టోర్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాడంటూ ఆయా స్టోర్ల వద్ద వేరొకరి ఫొటోతో ఇతని వివరాలను ముద్రించారు.

బా ఫేస్‌ డిటెక్షన్‌తో ఫోన్‌ అన్‌లాక్‌ చేసేందుకు ఉపయోగించిన డేటాను అసలు దొంగ కాజేసి.ఫేస్‌ డిటెక్షన్‌ సాఫ్ట్‌వేర్‌లో తన ఫొటోకు బా పేరుతో పాటు మొత్తం వివరాలను లింక్ చేసి యాపిల్‌ స్టోర్లకు వెళ్లి వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాడు.

అందువల్ల అతను చేస్తున్న దొంగతనాలకు బాను పోలీసులు చాలా సార్లు ప్రశ్నించేవారు.ఇలా చేయని తప్పులకు నిందితుడిగా ముద్ర వేయడం వలన తీవ్ర మనో వేదనకు గురైనట్లు బా ఇందుకు కారణమైన ఆ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి, వినియోగంలో ఉంచిన యాపిల్‌ సంస్థ సమాధానం చెప్పి తీరాలని, తనకు ఒక బిలియన్‌ డాలర్లను నష్ట పరిహారంగా చెల్లించాలని కోరుతూ మాన్‌హట్టన్‌లోని జిల్లా కోర్టులో దావా వేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube